
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పూల మొక్కలు పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంటి పెరట్లో మొక్కలు ఎక్కువ పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, పల్లెటూర్లలో పూల మొక్కలు చిన్న చిన్న చిట్కాలతో పెంచుతున్నారు. వాటిలో మందార మొక్క కూడా ఒకటి. అయితే, ఈ మొక్కను పెంచినా ఒక్కోసారి పూలు సరిగ్గా పూయవు

మందార మొక్కకు మొగ్గలు బాగా రావాలంటే.. మీరు రోజూ నీరు ఒక్కటే పోస్తే సరిపోదు. ఈ మొక్కకు కావాల్సిన సూర్యరశ్మి, పోషకాలు, సంరక్షణ కూడా అంతే అవసరం. కొన్నిసార్లు పచ్చగా, ఆరోగ్యంగా ఉన్నా కూడా పూలు సరిగా పూయవు. అలాంటి సమయంలో . ఈ రసం చెట్టు మొదట్లో చల్లితే పూలు బాగా పూస్తాయి.

బంగాళాదుంప బాగా పనిచేస్తుంది ఎందుకంటే దీనిలో పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇంకా వీటితో పాటు పిండి పదార్థం కూడాఅధికంగా ఉంటుంది. అయితే, ఈ పోషకాలు మొక్కకు అందుతాయో అది మట్టి మీద ఆధారపడి ఉంటుంది. మరి, దీనిని ఎలా వాడుతారో చూద్దాం..

తయారీ విధానం: ముందుగా మందార మొక్క కోసం ఒక మీడియం సైజ్ లో ఉన్న బంగాళాదుంపను ఒకటి తీసుకోండి. ఇంకా దానిపై మట్టి లేకుండా లేకుండా మంచిగా కడగాలి. ఆ తర్వాత తొక్క తీయకుండానే ముక్కలుగా కట్ కోసి మిక్సీ పట్టుకోవాలి, ఇప్పుడు దీనిలో కొంచం నీరు కలిపి మెత్తని పేస్ట్‌లా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ బంగాళాదుంప పేస్ట్ ను రెడీ చేసిన తర్వాత, దానికి నాలుగు రెట్ల నీటిని కలపాలి. ఇంకా మీరు దీనిని బాగా కలిపి ఒక రసంలా మార్చాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని దీనిని మంచిగా వడకట్టాలి. ఇలా చేసాక ఈ బంగాళాదుంప పిప్పిని వేరు చేసి దీని నుంచి , స్వచ్ఛమైన రసం వస్తుంది. రెండు , మూడు సార్లు చెట్టు మొదట్లో చల్లితే పూలు బాగా పూస్తాయి.