Tirupati MP by election : కొబ్బరి బొండాలమ్మకం.. సైకిల్ తొక్కుడు, పనబాక ప్రచార పరంపరలో పదనిసలు

|

Apr 06, 2021 | 7:31 PM

Panabaka Lakshmi Tirupati MP by election campaign : తిరుపతి ఉప ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న తిప్పలు అంతాఇంతా కాదు.

1 / 4
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం పీక్ స్టేజ్ కు చేరింది. మూడు పార్టీల ప్రధాన అభ్యర్థులు కాళ్లకు చక్రాలు కట్టుకుని ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో సీనియర్ అయిన పనబాక లక్ష్మి తనదైన స్టైల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

2 / 4
టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వింత వింత అవతారాలు ఎత్తుతూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఆమె. వినూత్న ప్రయత్నాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాటుపడుతున్నారు.

3 / 4
తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థిని అయిన పనబాక లక్ష్మి ఇవాళ వినూత్నరీతిలో ప్రచారం చేశారు. అందరితోపాటు సైకిల్‌ తొక్కి ఆకట్టుకున్నారు. ఆ పక్కనే రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి బోండాలు అమ్మే టైరుబండి వద్దకెళ్లి మహిళలు, పురుషులతో మాటా మాటకలిపారు. కుశల ప్రశ్నలు అడిగారు. కత్తితో కొబ్బరి బోండాన్ని కొట్టారు.

4 / 4
ఇలా పనబాక లక్ష్మి అందరితో కలసిపోతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నాలుగుసార్లు ఎంపీగా, రెండు సార్లు మంత్రిగా  పనిచేసిన పనబాక లక్ష్మి ప్రచారంలో తనదైన శైలి చూపిస్తున్నారు. తడ మండలం అక్కంపేట వద్ద ఈ వినూత్న దృశ్యాలు కనిపించాయి.