Motorcycle Rally Hyd – Delhi: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో మొదలైన బైక్ ర్యాలీ.. హైదరాబాద్ – న్యూఢిల్లీ.(ఫొటోస్)

|

Aug 02, 2022 | 7:03 PM

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఉత్సవాలలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, రక్షక దళం హైదరాబాద్ నుండి న్యూఢిల్లీకి 'మోటార్ సైకిల్ ర్యాలీ'ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్

1 / 11
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'  ఉత్సవాలలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, రక్షక దళం హైదరాబాద్ నుండి న్యూఢిల్లీకి 'మోటార్ సైకిల్ ర్యాలీ'ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇంచార్జి)   అరుణ్ కుమార్ జైన్ సోమవారం ఆగస్టు 1వ తేదీన నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు.

2 / 11
ఈ కార్యక్రమంలో  ఇనస్పెక్టర్ జనరల్ మరియు ఎస్ సి ఆర్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ శ్రీ రాజా రామ్,  సికింద్రాబాద్ డివిజన్ డి ఆర్ ఎం శ్రీ ఏ. కె. గుప్తా మరియు హైదరాబాద్ డివిజన్ డి ఆర్ ఎం శ్రీ శరత్ చంద్రాయన్ పాల్గొన్నారు.

3 / 11
భారతీయ రైల్వే లోని అయిదు జోన్లు :  ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఆగ్నేయ కేంద్ర రైల్వే, దక్షిణ రైల్వే మరియు నైరుతి రైల్వే తో పాటు దక్షిణ మధ్య రైల్వే జోన్లకు చెందిన ఆర్ పి ఎఫ్ రైడర్లు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. 
ఈ ర్యాలీకి దక్షిణ మధ్య రైల్వే ఆతిథ్యం వహిస్తుంది.

భారతీయ రైల్వే లోని అయిదు జోన్లు : ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఆగ్నేయ కేంద్ర రైల్వే, దక్షిణ రైల్వే మరియు నైరుతి రైల్వే తో పాటు దక్షిణ మధ్య రైల్వే జోన్లకు చెందిన ఆర్ పి ఎఫ్ రైడర్లు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ ర్యాలీకి దక్షిణ మధ్య రైల్వే ఆతిథ్యం వహిస్తుంది.

4 / 11
నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి 40 మంది రైడర్లు 20 బుల్లెట్ మోటార్ సైకిళ్లపై న్యూఢిల్లీకి బయలుదేరారు. వీరిలో ఆర్ పి ఎఫ్ కు చెందిన ఇద్దరు మహిళా రైడర్లు కూడా ఉన్నారు.1700 కిలోమీటర్ల దూరం సాగే ఈ యాత్ర తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా వెళ్తుంది.

5 / 11
తమ యాత్రలో రైడర్లు స్వాతంత్య్ర సమరాన్ని గురించి మరియు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అమృతోత్సవ సందేశాన్ని చాటుతారు.ఈ ర్యాలీ న్యూఢిల్లీ లోని నేషనల్ పోలీసు మెమోరియల్ వద్ద ముగుస్తుంది.'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఉత్సవాల నిర్వహణలో దక్షిణ మధ్య రైల్వే అగ్రభాగాన ఉంది.

6 / 11
ఇంతకు ముందు ఎస్ సి ఆర్ రైల్వే రక్షణ దళం 28 జూలై 2022న నాలుగు డివిజన్లకు చెందిన 46 మంది రైడర్లతో 23 బైకులపై 34 జిల్లాల మీదుగా 2977 కిలోమీటర్ల మోటార్ సైకిల్ యాత్రను జయప్రదంగా నిర్వహించారు.

7 / 11
దారిమధ్యలో ఉన్న ముఖ్యమైన స్టేషన్లలో వారిని సన్మానించారు. ప్రజలు భారీ సంఖ్యలో ఈ వేడుకోలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఎస్ సి ఆర్ జనరల్ మేనేజర్ (ఇంచార్జి)  శ్రీ అరుణ్ కుమార్ జైన్ స్వాతంత్య్ర సమరంతో రైల్వేలకు సన్నిహిత సంబంధం ఉందని,

8 / 11
 స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిందని అన్నారు.  స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో రవాణాకు,  సమాచారం చేరవేతకు రైల్వేలు విశ్వసనీయమైన వ్యవస్థగా ఉండేదని, దేశవ్యాప్తంగా జాతీయవాద దృక్పధాన్ని, ఉత్సాహాన్ని ప్రజలలో నింపడానికి, ఉద్యమాన్ని విస్తరించడానికి స్వాతంత్ర్య సమరయోధులు రైల్వే సౌకర్యాలను విస్తృతంగా ఉపయోగించుకున్నారని ఆయన అన్నారు.

9 / 11
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సంబరాలను రైల్వేలు జరుపుకోవడం, స్వాతంత్య్ర ఉద్యమ ప్రాముఖ్యత గురించి, సమరయోధుల త్యాగాల గురించి  జనజాగృతి కలిగించడం  ఎంతో గర్వించదగిన మహత్తర క్షణాలని ఆయన అన్నారు.

10 / 11
ఇనస్పెక్టర్ జనరల్ మరియు ఎస్ సి ఆర్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ శ్రీ రాజా రామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వేతో కలిపి మొత్తం 5 జోన్ల నుండి 1700 కిలోమీటర్ల కఠినమైన యాత్రలో పాల్గొంటున్న ఆరి పి ఎఫ్ బైక్ రైడర్లను ప్రశంసించారు.

11 / 11
పౌరుల ప్రాతినిధ్యం పెంచడంపై దృష్టిని కేంద్రీకరిస్తూ దేశవ్యాప్తంగా స్వాతంత్య్రము గురించి  తీవ్రస్థాయిలో జరుపుతున్న ప్రచారం 'జన్ ఆందోలన్'గా మార్చే లక్ష్యంతో సాగుతుందని ఆయన అన్నారు. ఈ ర్యాలీ ఆర్ పి ఎఫ్ సిబ్బంది నైతికస్థైర్యం పెంపొందీస్తుందని, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సంబరాలతో దేశవాసులను జత కలుపుతుందని ఆయన అన్నారు.