
ముందుగా బెండకాయలను తీసుకుని కడిగి శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని ఎక్కువ సేపు ఆరబెడితే కూర రుచిగా ఉంటాయని మన పెద్ద వాళ్ళు కూడా చెబుతారు. జిగురు పోయే వరకు ఈ ముక్కలను నూనెలో బాగా వేయించుకోవాలి.

ఇక ఇప్పుడు మసాలాను రెడీ చేసుకోండి. పచ్చి కొబ్బరి ముక్కలు , నానబెట్టిన బియ్యం, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ , ఒక టీ స్పూన్ ధనియాలు కలిపి మెత్తగా అయ్యేలా రోటిలో కానీ మిక్సీలో కానీ పట్టుకోవాలి రుబ్బుకోవాలి.

మూడు కప్పులు పెరుగు తీసుకుని, దానిలో రెండు గ్లాస్ లు నీళ్ళు పోసి మజ్జిగ కవ్వంతో చిలికి, దానిలో రుబ్బిన మసాలా పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

Bఈ మజ్జిగను తీసుకుని బెండకాయ ముక్కలున్న పెనంలో పోసి మంట తక్కువగా పెట్టి 10 నిముషాలు పాటు బాగా ఉడికించాలి. ముక్కలకు మజ్జిగ రసం పట్టే వరకు స్టవ్ మీదే ఉంచండి.

చివర్లో కొద్దిగా ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చి ముక్కలు , కొంచం ఇంగువ, కరివేపాకు ఆకులు వేసి వాటిని బాగా వేయించి ఈ బెండకాయ మజ్జిగ పులుసులో వేసుకుంటే రుచి అదిరిపోతోంది. సమ్మర్లో అయితే ఇది బెస్ట్ రెసిపి.