కేరళలో త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు..

Updated on: Sep 12, 2026 | 7:10 AM

సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో ప్రఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయంలో విశిష్ట సేవల్లో ఒకటిగా పేరున్న దీపారాధన సేవలో పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి సేవలో పాల్గొన్నారు.

1 / 5

2 / 5
ఆలయం ప్రధాన ద్వారం ఎదురుగా, శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన గావించారు. దీపారాధనతోపాటు ఆలయ సంప్రదాయాలను అనుసరించి మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. శంఖుచక్రాలతోపాటు ధనుస్సు, హారం ధరించిన శ్రీ రామస్వామి వారి అద్భుత రూపాన్ని దర్శించి, సంధ్యాకాల అర్చనలు నిర్వహించారు. శ్రీరామ స్వామి వారితో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణునికి, అయ్యప్ప స్వామకి పట్టు వస్త్రాల సమర్పించారు. అనంతరం గర్భాలయంలో మూలవిరాట్టుకి కుడివైపు ఉన్న దక్షిణా మూర్తికి, నైరుతి దిక్కున ఉన్న వినాయకుడికి, అనంతపద్మనాభ స్వామి వారి శయన రూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

3 / 5
ఆలయ మేల్ శాంతి శ్రీ రామన్ తిరుమేని గారు పూజ అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. అంతకు ముందు శ్రీరామ స్వామి క్షేత్రానికి విచ్చసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొచ్చిన దేవస్థానం బోర్డు ఛైర్మన్, శ్రీరామ స్వామి ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ అడ్మినిస్ట్రేటర్, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.శ్రీరాముల వారి  దర్శనానికి ముందు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అదే ప్రాంగణంలో ఉత్తర దిక్కున ఉన్న శ్రీకృష్ణుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. ఆ తరవాత చేపలకు ఆహారం అందించే సేవలో పాల్గొన్నారు. తీర్వా నదికి ఆలయం అనుకుని ఉండడంతో, ఆ నదిలో చేపలకి ఆహారం అందించడం ఎప్పటినుంచో ఒక ఆచారంగా వస్తోంది. ఇక్కడ చేపలకు ఆహారం అందించి మత్స్యావతార రూపుడైన విష్ణుమూర్తికి స్వయంగా ఆహారం అందించినట్టు భక్తులు భావిస్తారు. స్వామి వారి దర్శనానంతరం వేడి వజిపాడుగా పిలిచే బాణాసంచ పేల్చే సేవలో ఆయన పాల్గొన్నారు.

4 / 5
త్రిప్రయార్ ఆలయం తెరిచి ఉన్నంత సమయం బాణాసంచా పేల్చడం ఇక్కడ ఆచారం. సీతాదేవి ఆచూకి లభించిన విషయాన్ని తన పొలికేకతో ఆంజనేయ స్వామి వారు శ్రీరాముడికి చేరవేయగా, రామస్వామి బాణాసంచ పేలుడుతో బదులిచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. దాన్నే త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో నేటికీ పాటిస్తున్నారు. వేది వజిపాడుగా పిలిచే ఈ సేవలో పాల్గొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, 1,001 టపాసులు పేల్చేందుకు అయిన మొత్తాన్ని విరాళంగా సమర్పించారు. చివరిగా శ్రీ శాస్తగా భక్తులు కొలుచుకునే అయ్యప్పస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

5 / 5
త్రిప్రయార్ లోని శ్రీరామ స్వామి విగ్రహం ద్వాపర యుగంలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడిచే పూజలందుకున్నట్టు పురాణాల్లో ఉంది. 
 ద్వారకానగరం సముద్ర గర్భంలో కలసిపోయిన అనంతరం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు కేరళం తీరానికి కొట్టుకువచ్చినట్టు చరిత్ర చెబుతోంది. కేరళంలో ఆలయానికి సమీపంలో ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

త్రిప్రయార్ లోని శ్రీరామ స్వామి విగ్రహం ద్వాపర యుగంలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడిచే పూజలందుకున్నట్టు పురాణాల్లో ఉంది. ద్వారకానగరం సముద్ర గర్భంలో కలసిపోయిన అనంతరం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు కేరళం తీరానికి కొట్టుకువచ్చినట్టు చరిత్ర చెబుతోంది. కేరళంలో ఆలయానికి సమీపంలో ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us