
మీరు మీ పిల్లలను తీసుకొని బయటకు వెళ్లినప్పుడు వారు అక్కడ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ.. ప్రతి వస్తువును తాకుతూ అక్కడ అన్నింటినీ చూస్తున్నాడు అంటే, ఆ పిల్లవాడు ప్రపంచాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని కలిగి ఉన్నాడని, ఆ పిల్లవాడికి మంచి తెలివితేటలు, నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉన్నదని అర్థం చేసుకోవాలంట.

అదే విధంగా ఒక పిల్లవాడు తాను ఏదో పని చేస్తూ అందులోనే ఏకాగ్రతతో మునిగిపోయి, పక్కవారు చెప్పేది కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు అంటే? తాను తనపని పట్ల పూర్తి అవగాహనతో ఉన్నాడని, ఏపని చేసినా ఏకగ్రతగా చేస్తాడనే అర్థం. అది అతని భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుదని చెబుతున్నారు నిపుణులు.

కొంత మంది పిల్లలు ఎక్కువగా మాట్లాడుతుంటారు. కథలు చెప్పడం లేదా ఎక్కువ చుట్టూ ఉన్న విషయాల గురించి మాట్లాడటం చేస్తుంటాడు. అయితే అలాంటి వ్యక్తి చాలా సృజనాత్మకను కలిగి ఉండటం లేదా అతను ఊహాత్మక సామర్థ్యం కలిగి ఉన్నాడని అర్థం చేసుకోవాలంట. తన భవిష్యత్తులో ఏ విషయాన్ని అయినా సరే అర్థం చేసుకొనే నేర్పు పిల్లవాడిలో ఉంటుందంట.

కొన్ని సార్లు పిల్లలు ఏదైనా పని చేసినప్పుడు తనను తాను సమర్థించుకోవడం చేస్తుంటాడు. అంతే కాకుండా తన గురించి చెబుతుంటారు. అయితే చాలా తెలివిగల వ్యక్తులు మాత్రమే తాను చేసిన పనుల గురించి చెప్పుకొని సమర్థించుకుంటారు.తమ అభిప్రాయలు మీ ముందు ఉంచుతారు అంటున్నారు నిపుణులు.

మీ పిల్లవాడు ఈ పని తాను చేయగలనని చెబితే, అతన్ని ఆపకండి. ప్రతిదీ స్వయంగా చేయాలనే కోరిక అతను స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడని, అతని ఆలోచన స్వతంత్రంగా ఉందని చూపిస్తుంది. ఇది ప్రతిభావంతులైన పిల్లల బలమైన అలవాటు. అని చెప్తున్నారు నిపుణులు.