
వర్షాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ వంటి సమస్యలు అధికం అవుతాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ సమయంలో ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వర్షాకాలంలో పచ్చి మిర్చి వెల్లుల్లి కారం పచ్చడిని వేడి వేడి అన్నంలో రోజుకు ఒకసారి తినడం వలన దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందంట. కాగా, ఈ ఆరోగ్యకరమైన పచ్చి మిర్చి వెల్లుల్లి కారం ఎలా చేయాలంటే?

కావాల్సిన పదార్థాలు : ఉల్లిపాయలు పెద్దవి, వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, కారం పొడి, ఉప్పు, నూనె, ఒక్క లవంగం, చిన్న అల్లం మక్క.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా కప్పుల వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. వాటి పై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. పాన్ పెట్టి అందులో కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఎండు మిర్చి, వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత వాటిలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి వాటిని కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో చల్లార బెట్టుకున్న ఈ మిశ్రమం వేయాలి. అలాగే కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, అన్నీ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు. కచ్చా పచ్చాగా ఉండేలా చూసుకోవాలి.

ఇక కొంత మంది దీనిని ఇలాగే తింటారు. ఇలా తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి కొంత మంది తాళింపు పెట్టుకొని తింటారు. కాగా, ఇప్పుడు మనం దీనిని తాళింపు ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. అందులో నూనె పోసి, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి.

తర్వాత అందులో మనం మిక్సీ పెట్టుకున్న పచ్చడి వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పచ్చి మిర్చి వెల్లుల్లి కారం రెడీ. వేడి వేడి అన్నంలో దీనిని కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది. అంతే కాకుండా వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబు, గొంతు నొప్పి అన్నీ కూడా మాయం అవుతాయి.