Orange Peel Soap: ఆరెంజ్‌ తొక్కలతో సబ్బు తయారు చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Updated on: Jan 17, 2024 | 9:03 PM

నారింజ పండ్లు శీతాకాలంలో అధికంగా దొరుకుతాయి. ఈ కాలంలో దొరికే కమలాపండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు సమస్య దరిచేరకుండా కాపాడుతుంది. నారింజ ఈ సమస్యలన్నింటికీ దూరం చేస్తుంది. తాజా ఆరెంజ్ జ్యూస్ తాగినా మంచిదే. నారింజతో అనేక రకాల ఆహారాలను కూడా తయారు చేసుకోవచ్చు. కమలా కట్ల, చికెన్ కర్రీ, కమలా పైస్, కమలా స్వీట్స్ వంటి పలురకాల వెరైటీస్‌ తయారు చేసుకోవచ్చు..

1 / 5
నారింజ పండ్లు శీతాకాలంలో అధికంగా దొరుకుతాయి. ఈ కాలంలో దొరికే కమలాపండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు సమస్య దరిచేరకుండా కాపాడుతుంది. నారింజ ఈ  సమస్యలన్నింటికీ దూరం చేస్తుంది. తాజా ఆరెంజ్ జ్యూస్ తాగినా మంచిదే.

2 / 5
నారింజతో అనేక రకాల ఆహారాలను కూడా తయారు చేసుకోవచ్చు. కమలా కట్ల, చికెన్ కర్రీ, కమలా పైస్, కమలా స్వీట్స్ వంటి పలురకాల వెరైటీస్‌ తయారు చేసుకోవచ్చు. అయితే నారింజ తిన్న తర్వాత తొక్కను పారేయకండి. వీటిని సౌందర్య సాధనాలలో ఉపయోగించవచ్చు.

3 / 5
నారింజ తొక్కను పౌడర్ చేసి పచ్చి పాలతో కలిపి చర్మానికి అప్లై చేస్తే.. చర్మం మెరిసిపోతుంది. మృదువుగానూ మారుతుంది. నారింజ తొక్కలతో సబ్బును కూడా తయారు చేసుకోవచ్చు. శీతాకాలం ముగిసిన తర్వాత కూడా ఈ సబ్బును ఉపయోగించవచ్చు. ఈ సబ్బును ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

4 / 5
నారింజ పైతొక్కలోని తెల్లని భాగాన్ని వీలైనంత వరకు తొలగించి, బాగా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు పై తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, కొద్దిగా నీళ్లతో కలిపి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. శీతాకాలంలో ఇంట్లో వినియోగించే గ్లిజరిన్ సబ్బును తురుము పూర్తిగా తురుముకోవాలి. మొత్తం సబ్బు అవసరం. స్టౌపై ఒక పాన్‌ పెట్టి, అందులో నీళ్లు పొయ్యాలి. నీళ్లపై ఒక గిన్నె ఉంచి సబ్బు తురుమును అందులో వేసి కరిగించాలి. సబ్బు పూర్తిగా కరిగిన తర్వాత, నారింజ తొక్క పేస్ట్ కలపాలి. ఇప్పుడు సిలికాన్ సోప్ అచ్చు తీసుకుని, అందులో సబ్బు పేస్ట్ వేసుకోవాలి. సాధారణ ఉష్ణోగ్రత వద్ద 2 గంటలు అలాగే ఉంచితే సబ్బు సిద్దం అవుతుంది.

5 / 5
ఈ సబ్బు చర్మానికి చాలా మంచిది. చలికాలంలో ముఖంపై మురికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఇంట్లో తయారుచేసిన సబ్బుతో మీ ముఖాన్ని శుభ్రం చేయడం వల్ల ముఖం తక్షణమే శుభ్రం అవడంతోపాటు, చర్మం మృదువుగా మారుతుంది.