
మామిడికాయ ఎండు నెత్తళ్ల కూరకు కావలసిన పదార్థాలు: పావుకిలో ఎండు నెత్తళ్లు , ఒక పచ్చి మామిడికాయ పెద్దది, రెండు ఉల్లిపాయలు , 5 పచ్చిమిర్చి , ఎండుమిర్చి , వెల్లుల్లి రెబ్బలు , అర టీ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , అర టేబుల్ స్పూన్ జీలకర్ర , కరివేపాకు , కొత్తిమీర, నీరు తగినంత తీసుకోవాలి

మామిడికాయ ఎండు నెత్తళ్ల కూర తయారీ విధానం: ముందుగా ఎండు నెత్తళ్లను కడిగి 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి. అదే విధంగా మామిడికాయను కూడా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలి.

ఇక ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, రెండు వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి నీరు పోసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి, కారం పొడి వేసి కలపాలి. ఇంకా వీటితో పాటు మామిడికాయ ముక్కలు, ముందుగా నానబెట్టిన ఎండు నెత్తళ్లను వేసి కలుపుకోవాలి.

కూరలో ముక్కలు మునిగే వరకు నీరు పోసి మూత పెట్టి మీడియం మంటపై దీనిని ఉడికించాలి.మామిడికాయ ముక్కలు బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఎండు నెత్తళ్ల నుంచి నూనెతోనే ఇది ఉడుకుతుంది. ఇంకా ఈ రుచి కూరలో కలిసిపోతుంది మీరు నూనె ఒక్క చుక్క కూడా వేయాల్సిన అవసరం లేదు. చివరగా కొత్తిమీర వేసి దించుకోవడమే.

మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కూరకు మంచి రుచి వస్తుంది. ఇంకా ఎండు నెత్తళ్లలో ఉప్పు అధికంగా ఉంటుంది కాబట్టి మీరు ఉప్పు వేసే ఒకసారి చూసుకుని సరిపడా వేసుకోవాలి. ఈ కూరను ఒక రాత్రి మొత్తం తినకుండా ఆ తర్వాత రోజు తింటే రుచి ఇంకా పెరుగుతుంది. వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ ఎండు నెత్తళ్ల కూర వేసుకుని తింటే సూపర్ ఉంటుంది.