
చాలా మందిలో కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి. సాధారణంగా ఈ తిమ్మిర్లు అనేవి అప్పుడప్పుడూ రావడం సహజం. కానీ ఎక్కువగా వస్తున్నాయి అంటే మాత్రం.. మీరు గమనించవలిసిందే. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఇలా తిమ్మిర్లు వస్తాయి. ఈ సమస్యలను కొన్ని ఆహారాలతో తగ్గించుకోవచ్చు.

చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. చేపలు తినడం వల్ల.. రక్తా నాళాల్లోకి రక్తం సరఫరా అనేది బాగా జరుగుతుంది. అలాగే రక్తం గడ్డ కట్టడాన్ని కూడా నివారిస్తుంది. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వచ్చేవారు ట్యూనా, మకేరల్ చేపలు తినడం మంచిది.

ఉల్లిపాయలు తినడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ రక్త సరఫరా సరిగ్గా జరిగేందుకు సహాయ పడతాయి.

విటమిన్ సి ఉండే ఆహారాలు తినడం కూడా చాలా మంచిది. ఇది రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. అలాగే రక్త సరఫరాను కూడా మెరుగు పరుస్తుంది. ఉసిరి, నిమ్మకాయ, బత్తాయి, కమలా పండు, బెర్రీస్‌లో విటమిన్ సి మెండుగా ఉంటుంది.

మనకు ఎక్కువగా లభ్యమయ్యే వెల్లుల్లి తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్త నాళాలకు మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. రక్త సరఫరాను సరిగ్గా జరిగేలా చేస్తుంది.