
ఇది ముఖ్యంగా శాఖాహారులకు హానికరం. టీ, కాఫీలలో ఉండే కెఫిన్ కడుపులో ఆమ్ల పరిమాణాన్ని పెంచుతుంది. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల గుండెల్లో మంట వస్తుంది.

నొప్పి నివారణ మందులు: పారాసెటమాల్, ఆస్ప్రిన్ వంటి మందుల్లో అప్పటికే కొంత కెఫిన్ ఉంటుంది. వీటితో పాటు మళ్లీ కాఫీ తాగడం వల్ల కెఫిన్ మోతాదు పెరిగి, మందులు రక్తంలోకి అతివేగంగా చేరుతాయి. దీనివల్ల కడుపులో మంట, రక్తస్రావం లేదా కడుపులో పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది గుండెపై కూడా అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.

జలుబు - ఫ్లూ మందులు: జలుబు మందులలో ఉండే సూడోఎఫెడ్రిన్ ఒక ఉద్దీపనగా పనిచేస్తుంది. కాఫీలోని కెఫిన్ కూడా ఉద్దీపనమే. ఈ రెండూ కలిస్తే నాడీ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా విపరీతమైన వణుకు, నిద్రలేమి, తలనొప్పి మరియు గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు టీ లేదా కాఫీని నివారించలేకపోతే భోజనం తర్వాత కనీసం 45 నిమిషాల నుంచి 1 గంట తర్వాత దీనిని తీసుకోవాలి. ఇది శరీరానికి ఆహారంలోని పోషకాలను గ్రహించడానికి తగినంత సమయం ఇస్తుంది.

యాంటిడిప్రెసెంట్స్ - యాంటిసైకోటిక్స్: మానసిక సమస్యలకు వాడే మందులతో కాఫీలోని టానిన్లు రసాయనిక చర్య జరుపుతాయి. ఇది శరీరం మందులను గ్రహించకుండా నిరోధిస్తుంది. కొన్ని సందర్భాల్లో రక్తంలో మందుల స్థాయిని 97శాతం వరకు పెంచి.. విపరీతమైన మైకము, గందరగోళానికి దారితీస్తుంది.