
ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని, రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, మళ్లీ నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టండి. నార్మల్ రైస్ కూడా ఉపయోగించవచ్చు. ఒక కొబ్బరి చిప్పను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లోకి తీసుకోండి. కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్‌ను శుభ్రమైన క్లాత్‌లో వేసి కొబ్బరి పాలను పిండండి.

కొబ్బరి పిప్పిని మళ్లీ మిక్సీ జార్‌లోకి తీసుకొని, కొద్దిగా నీళ్లు పోసి మరోసారి గ్రైండ్ చేసి పాలను తీయండి. ఇలా రెండుసార్లు పాలు తీయడం వల్ల ఎక్కువ పాలు వస్తాయి. ఒక గ్లాసు బియ్యానికి సరిపడా రెండు గ్లాసుల కొబ్బరి పాలను కొలిచి పక్కన పెట్టుకోండి. ఒకవేళ కొబ్బరి పాలు ఒకటిన్నర గ్లాసు మాత్రమే వస్తే, మిగిలిన అర గ్లాసు నీటిని కలుపుకోవచ్చు.

కొబ్బరి పిప్పిని మళ్లీ మిక్సీ జార్‌లోకి తీసుకొని, కొద్దిగా నీళ్లు పోసి మరోసారి గ్రైండ్ చేసి పాలను తీయండి. ఇలా రెండుసార్లు పాలు తీయడం వల్ల ఎక్కువ పాలు వస్తాయి. ఒక గ్లాసు బియ్యానికి సరిపడా రెండు గ్లాసుల కొబ్బరి పాలను కొలిచి పక్కన పెట్టుకోండి. ఒకవేళ కొబ్బరి పాలు ఒకటిన్నర గ్లాసు మాత్రమే వస్తే, మిగిలిన అర గ్లాసు నీటిని కలుపుకోవచ్చు.

ప్రెషర్ కుక్కర్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక, చిన్న బిర్యానీ ఆకు, దాల్చినచెక్క ముక్కలు, 15-20 మిరియాలు, మూడు లవంగాలు, రెండు యాలకులు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేయించండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఆరేడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించండి. మరింత రుచి కోసం కొద్దిగా జీడిపప్పును కూడా కలుపుకోవచ్చు.

ఇవి సగం వేగిన తర్వాత, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. తరువాత, రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల బీన్స్ ముక్కలు, ఒక బంగాళాదుంప ముక్కలు వేసి రెండు మూడు నిమిషాలు వేయించండి. మీకు నచ్చిన ఇతర కూరగాయలు, క్యాప్సికం లేదా కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. కడిగి నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు వంపేసి కుక్కర్‌లో వేయండి. ఒకసారి బాగా కలిపి, రుచికి సరిపడా ఒకటిన్నర నుండి రెండు టీ స్పూన్ల ఉప్పు కలపండి. ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరను వేసి కలపండి. ముందుగా కొలిచి పెట్టుకున్న రెండు గ్లాసుల కొబ్బరి పాలను పోయండి. ఒకసారి బాగా కలిపి, ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసుకోండి. కొంచెం స్పైసీగా కావాలంటే అర టీ స్పూన్ గరం మసాలా కలుపుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. బియ్యం నానబెట్టడం వలన త్వరగా ఉడుకుతుంది. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కిందకి దించి నైవేద్యంగా పెట్టడమే.