నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం చక్కెర పొంగలి..

Updated on: Oct 12, 2026 | 2:40 PM

మీరు 4 కేజీల చక్కెర పొంగలిని చేస్తే ఈ రెసిపీని 30 నుండి 40 మంది అతిథులకు పెట్టొచ్చు. ఇది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, రుచిలో, తయారీలో ఎంతో ప్రత్యేకతను తెచ్చుకున్న ప్రసాదం. కచ్చితమైన కొలతలు, సరైన పద్ధతులు పాటిస్తే, మీరు కూడా ఇంట్లోనే గుడిలో చేసినట్లు ఈ చక్కెర పొంగలిని ఈజీగా తయారు చేయవచ్చు.

1 / 5
కచ్చితమైన కొలతలతో మీరు 4 కేజీల చక్కెర పొంగలిని చేస్తే ఈ రెసిపీని 30 నుండి 40 మంది అతిథులకు పెట్టొచ్చు. ఇది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, రుచిలో, తయారీలో ఎంతో ప్రత్యేకతను తెచ్చుకున్న ప్రసాదం. కచ్చితమైన కొలతలు, సరైన పద్ధతులు పాటిస్తే, మీరు కూడా ఇంట్లోనే గుడిలో చేసినట్లు  ఈ చక్కెర పొంగలిని ఈజీగా తయారు చేయవచ్చు.

2 / 5
మొదటగా, కప్పుంపావు పెసరపప్పును సన్నని సెగ మీద కలుపుతూ దోరగా వేపుకోవాలి. పప్పు లోపలి వరకు వేగితేనే చక్కెర పొంగలికి మంచి రుచి, సువాసన వస్తుంది. వేగిన పప్పును పక్కన పెట్టుకోండి.తరువాత, రెండు కప్పుల బియ్యం, వేపుకున్న పెసరపప్పు కలిపి రెండు సార్లు పైపైన కడగాలి. ఇందులో 1200 మిల్లీలీటర్ల నీళ్లు, కొద్దిగా నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్‌లో మూతపెట్టి వండాలి. అన్నం 90% ఉడకాలి. పూర్తిగా ఉడకకుండా కొద్దిగా పలుకుగా ఉంటేనే మంచిది, ఎందుకంటే మిగిలినది బెల్లం పాకంలో ఉడుకుతుంది. అన్నం 90% ఉడికిన తర్వాత స్టవ్ ఆపి పక్కన పెట్టుకోండి.

3 / 5
ఇప్పుడు బెల్లం పాకం తయారుచేసుకోవాలి. ఒక గిన్నెలో అర లీటరు నీళ్లు పోసి, 700 గ్రాముల బెల్లం, 100 గ్రాముల పంచదార వేయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టుకోవాలి. వడకట్టిన బెల్లం పాకాన్ని మళ్లీ పొయ్యి మీద పెట్టి, జిగురుగా అంటే నూనె మాదిరిగా  జిగురుగా అయ్యేంత వరకు మాత్రమే మరిగించాలి. పాకం మరీ చిక్కగా అయితే అన్నం పాకాన్ని పీల్చదు, పల్చగా ఉంటే అన్నం గుజ్జుగా అవుతుంది. పాకం జిగురుగా మారగానే, ఉడికించిన అన్నాన్ని వేసి నెమ్మదిగా కలుపుతూ, పాకంలో అన్నం ఉడికే వరకు సుమారు 30 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.

4 / 5
అన్నం బెల్లం పాకాన్ని దాదాపు పీల్చేసిన తర్వాత, సుమారు 20 నిమిషాల తరువాత, మొత్తం 400 గ్రాముల నెయ్యి అవసరం అవుతుంది. మొదట 250 మిల్లీలీటర్ల నెయ్యి పోసి బాగా కలిపి మరో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. నెయ్యి పైకి తేలిన తర్వాత స్టవ్ ఆపేసి, 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి.

5 / 5
స్టవ్ ఆపి 10 నిమిషాల తర్వాత, ఒక కప్పు తేనె పోసి నెమ్మదిగా కలపాలి. తేనె కలపడం వల్ల చక్కెర పొంగలికి అద్భుతమైన రుచి, ప్రత్యేకమైన మెరుపు వస్తుంది. ఈ తేనె చిట్కా చక్కెర పొంగలి రుచిని పెంచుతుంది.  చివరగా, మిగిలిన నెయ్యిలో పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేపుకోవాలి. ఎండు కొబ్బరి రంగు మారుతున్నప్పుడు, పావు కప్పు జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేపి చక్కెర పొంగలిలో కలపాలి. ఇందులో రెండు చిటికెల పచ్చ కర్పూరం, ఒక టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us