
కావలసిన పదార్థాలు: ఒక కప్పు తెల్ల నువ్వులు, ఒక కప్పు తురిమిన బెల్లం, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక కప్పు ఎండు కొబ్బరిని తీసుకోవాలి.

నువు లడ్డులు తయారీ విధానం ఎలా చేయాలంటే? ముందుగా స్టవ్ వెలిగించి ఓ పాన్ లో నువ్వులను వేసి సన్నని మంటపై బాగా వేయించాలి. అయితే, వీటిని మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించి ఒక ప్లేట్‌లో కానీ, గిన్నెలో కానీ తీసుకోవాలి.

ఇక నువ్వులను చల్లార్చి తీసుకుని మిక్సీ వేసుకుని మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకుని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

ఇప్పుడు అదే జార్‌లో ఒక కప్పు తురిమిన బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి రెండో సారి తిప్పుకోవాలి. నువ్వుల్లోని నూనె, బెల్లం వలన ఇది లడ్డులా తయారవుతుంది.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద ప్లేట్ లోకి తీసుకోవాలి. దానిలో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని కలపాలి. ఇప్పుడు మీకు నచ్చిన విధంగా లడ్డులూ చేసుకోవాలి. అయితే, వీటిని గాలి చొరబడని పాత్రలో పెడితే నెల రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.