
మీ జుట్టు తెల్లగా మారింది. దానిని శాశ్వతంగా నల్లగా మార్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇంట్లోనే తయారు చేసే ఈ చిట్కాతో మీరు ఈజీగా దాన్ని పొందవచ్చు. అవును కాఫీ, నల్ల జీలకర్ర గింజలతో తయారు చేసిన సహజమైన హెయిర్ డై తెల్లగా మారిన మీ జుట్టును నల్లగా చేయడమే కాకుండా, దాని మెరుపును, బలాన్ని పెంచడంలో కూడా ఎంతో భాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్యాక్ తయారీకి ఏం పదార్థాలు కావాలి.. దీన్ని సింపుల్‌గా ఎలా తయారు చేయాఓ చూద్దాం. దీన్ని సులభంగా ఎలా తయారు చేయాలో మరియు ఉపయోగించాలో తెలుసుకుందాం.

సహజమైన హెయిర్ డై తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు చూసుకుంటే 3 నుండి 4 టీస్పూన్ల నల్ల జీలకర్ర, , 1 టీస్పూన్ కాఫీ పొడి , 1 కప్పు ఫిల్టర్ చేసిన నీరు , 3 టీస్పూన్ల కలబంద జెల్ ఉంటే సరిపోతుంది. ఈ పేస్ట్ తయారు చేయడానికి ముందుగా, ఒక గిన్నెలో నీళ్ళు పోసి, అందులో నల్ల జీలకర్ర, కాఫీ పొడిని కలపాలి. దాన్ని స్టవ్‌పై 2 నుండి 3 నిమిషాల పాటు బాగా మరిగించాలి.

తర్వాత ఈ మిశ్రమాన్ని జల్లెడలో వడకట్టి, ఆ ద్రవాన్ని ఒక జార్‌లోకి తీసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కాసేపు చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కలబంద జెల్ వేసి మరోసారి బాగా కలపాలి. జెల్ పూర్తిగా కరిగిపోయేంత వరకు కలపండి. ఇలా చేయడం వల్ల జుట్టుకు సులభంగా అప్లై చేయగల చిక్కటి పేస్ట్ తయారవుతుంది. అప్పుడు ఓ బ్రెష్ సహాయంతో ఆ పేస్ట్‌ను మీ జుట్టుకు మొత్తం సమానంగా అప్లై చేయండి.

పేస్ట్‌ను అప్లై చేశాక 30 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత, సాధారణ షాంపూతో కడగండి. ఇంట్లో తయారు చేసుకున్న ఈ హెయిర్ డై ప్రత్యేకత ఏమిటంటే, ఇది మిగతా హెయిర్ డైలలా మీ చర్మంపై ఎలాంటి రంగు మరకలను పడనివ్వదు.పైగా ఇది సహజంగా ఇంట్లోనే తయారు చేసింది కాబట్టి జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఈ సాంప్రదాయ హెయిర్ ప్యాక్‌లోని కాఫీ, నల్ల జీలకర్రలో జుట్టుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును నల్లగా మార్చడంతో పాటు జుట్టును ఒత్తుగా బలంగా మారుస్తుంది. అలాగే ఇందులోపి కలబంద జెల్ జుట్టుకు తేమను అందించి, మృదువుగా ఉండేలా చేస్తుందని అంటారు. అయితే అందరిపై ఇది ఒకే ప్రభావాన్ని చూపకపోవచ్చు. కాబట్టి దీన్ని ట్రై చేసే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీకు ఎవైనా ఎలర్జీ అనిపిస్తే వెంటనే ఆపేయండి. (Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నేట్ నుంచి సేకరించిన సమాచారం మేరకు మాత్రమే అందించినవి.. వీటిని tv9 దృవీకరించడం లేదు.