
మన గోళ్ల మొదట్లో అర్ధచంద్రాకారంలో చిన్న గుర్తు కనిపిస్తుంది. అయితే ఇది చూడటానికి నార్మల్‌గా అనిపించినప్పటికీ, ఇది గుండె, మూత్రపిండాలు, శరీరం ఎలా పని చేస్తుందో తెలియజేస్తుందంట. మీ గోళ్లను బట్టి మీకు ఉన్న అనారోగ్య సమస్యలను అంచనా వేయవచ్చునంట. ఇది ఎక్కువగా బొటన వేలుపై కనిపిస్తుంటుంది. ఇది మీ శరీరంలో రక్తప్రసరణ ఎలా జరుగుతుంది? జీర్ణక్రియ, అవయవాల పనితీరు గురించి చాలా వివరంగా తెలియజేస్తుందంట.

అయితే ఎన్ ఐ హెచ్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం, గోళ్లపై ఉండే అర్ధ చంద్రాకారం గుర్తును లూన్యులా అంటారు. అయితే ఇవి కొంత మందికి సహజంగానే ఉండకపోవచ్చు. మరికొంత మందికి పెద్దగా కనిపించవచ్చును. అయితే అసలు లానులా లేకపోవడం, రంగు మారడం వంటిది కనిపిస్తే ఇది ఎలాంటి అనారోగ్య సమస్యలను సూచిస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

వేలి గోళ్లలో తెల్లటి నెల వంక లాంటి లూన్యులా లేకపోతే, ఇది జన్యుపరమైన లేదా సహజ వృద్ధాప్య ప్రక్రియకు కారణం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఒక్కసారిగా అది కనిపించడం లేదు అంటే, రక్తహీనత, అలసట, థైరాయిడ్, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిని సూచిస్తుందంట. అంతే కాకుండా, విటమిన్ బీ 12 లోపం, రక్తప్రసరణ సరిగ్గా జరగని వారిలో ఇది సరిగ్గా కనపడదు అని చెబుతున్నారు నిపుణులు.

అలాగే ఒక వేళ లూన్యులా లేత రంగులో మార్పు రావడం, అంచులు ఏర్పడటం, గీతలు కనిస్తూ ఉండటం, అస్పష్టంగా కనిపించడం లాంటిది జరిగితే, ఇది ప్రోటీన్ లోపం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఐరన్, ప్రోటీన్, విటమిన్స్ మంచిగా ఉండే ఆహారాలు తీసుకోవడం వలన లానులా ఆరోగ్యంగా ఉంటుందంట.

అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు ఆరోగ్యకరమైన లూన్యులా ఎలా ఉంటుంది? దీనిని ఎలా గుర్తించాలి అనే డౌట్ ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన లూన్యులా లేత రంగులో వృత్తాకారంలో కనిపిస్తుంది. దీనిపై ఎలాంటి గీతలు ఉండవు, చాలా స్పష్టంగా కనిపిస్తుంది.