మటన్ పప్పు కాంబో.. ఇలా చేసి తింటే.. అబ్బబ్బా జన్మలో మర్చిపోలేరు!

Updated on: May 16, 2026 | 8:39 PM

మటన్ పప్పు కాంబో.. ఇలా చేసి తింటే.. అబ్బబ్బ జన్మలో మర్చిపోలేరు!నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. చాలా మంది చాలా ఇష్టంగా నాన్ వెజ్ తింటారు. అయితే ఎప్పుడూ రోటీన్‌గా మటన్ కర్రీ కాకుండా, మటన్ పప్పు కలిపి వండితే టేస్ట్ అదిరిపోతుందంట. మటన్, పప్పు కాంబో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి వండుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇష్టంగా తింటారంట. కాగా ఈ స్పెషల్ కర్రీని ఎలా వండాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : మటన్ కేజీ, కంది పప్పు 1 కప్పు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కారం, గరం మాసాలా, ధనియాల పొడి, ఉల్లిపాయలు, కొత్తిమీర, నూనె, ఉప్పు, జీలకర్ర, లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్.

2 / 5
తయారీ విధానం : ముందుగా మటన్ తీసుకోవాలి. దీనిని శుభ్రంగా గోరు వెచ్చటి నీటిలో కడగాలి. తర్వాత బౌల్‌లోకి తీసుకొని, అందులో ఉప్పు , కారం, వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దాదాపు పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పప్పు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి.

3 / 5
కందిపప్పు తీసుకొని దానిని శుభ్రంగా కడిగి, అందులో వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కారం, ఉప్పు, పచ్చి మిర్చి, చిటికెడు పసుపు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఈ ఉడికిన పప్పును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలి. దీని కోసం ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. అందులో పప్పు మటన్ ఉడకడానికి సరిపడ నూనె వేసుకోవాలి.

4 / 5
నూనె వేడి అయిన తర్వాత పచ్చి మిర్చీ, ఆనియన్ ముక్కలు , చిటికెడు పసుపు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి మంచిగా వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత కొన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. మటన్ ఎంత బాగా ఉడికితే పప్పుతో అంత టేస్ట్ ఉంటుంది.

5 / 5
దాదాపు మటన్ 70 శాతం ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా ఉడకబెట్టుటకున్న  కందిపప్పు వేయాలి. ఈ రెండింటిని బాగా కలిపి మరో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో ధనియాల పొడి, గరం మసాలా వేసి మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. రెండు నిమిషాలు మంటపై ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ మటన్ కందిపప్పు కర్రీ రెడీ. మరి మీరు కూడా ట్రై చేయండి.

Follow Us