
ఏజ్ పెరిగే కొద్ది ఫేస్‌పై ముడతలు, ఫైన్ లైన్స్, చర్మం వదులుగా మారడం సహజం. ఈ సమస్యను తగ్గించుకోవడానికి, యవ్వనంగా కనిపించడానికి జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రకాల బ్యూటీ ప్రాడక్ట్స్‌ను వాడుతుంటారు. కానీ మన కిచెన్‌లో దొరికే రెండు పాదార్థాలను వాడి ఈజీగా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.

పురాతన కాలం నుంచి చర్మ సౌందర్యానికి ముల్తానీ మట్టి, బంగాళాదుంప రసంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది వదులుగా మారిన చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముల్తానీ మట్టి: 2 పెద్ద చెంచాలు, తాజా బంగాళాదుంప రసం: 2 నుండి 3 పెద్ద చెంచాలు, రోజ్ వాటర్, 1 చిన్న చెంచా, కలబంద గుజ్జు లేదా తేనె: అర చెంచా ఉంటే సరిపోతుంది.

ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అంటే.. మొదట ఒక చిన్న బంగాళాదుంపను శుభ్రంగా కడిగి, తొక్క తీసి తురుముకోండి. అలా తురిమిన దానిని కాటన్ గుడ్డలో లేదా జల్లెడలో వేసి పిండి దాని నుంచి వచ్చే తాజా రసాన్ని ఒక పాత్రలోకి తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ముల్తానీ మట్టిని తీసుకుని, అందులో బంగాళాదుంప రసం, రోజ్ వాటర్, అలోవెరా జెల్ లేదా తేనె కలిపి బాగా మిక్స్ చేయండి. దాన్ని ఒక పేస్ట్‌లా తయారు చేయండి.

ఎలా వాడాలి: మీరు దీన్ని వాడడానికి ముందుగా ఫేస్‌ను ఓ మైల్డ్ ఫేస్ వాష్‌తో శుభ్రం చేసుకుని, మెత్తటి టవల్‌తో తుడుచుకోవాలి. ఇప్పుడు మీరు తయారుచేసి పెట్టుకున్న ఫేస్ ప్యాక్‌ను వేళ్లతో లేదా బ్రష్‌తో ముఖం, మెడపై అప్లై చేసుకోవాలి. అయితే దీన్ని కళ్లు, పెదవుల చుట్టూ రాయకండి. మరో విషయం ప్యాక్ వేసుకున్న తర్వాత మాట్లాడటం లేదా ముఖ కదలికలు ఇవ్వడం ఆపేయండి. దాదాపు 15 నుండి 20 నిమిషాలు పాటు అలాగే ఉంచి అది ఆరిన తర్వాత ముఖంపై కొద్దిగా నీళ్లు చిలకరించి వేళ్లతో మసాజ్ చేయండి. తర్వాత నీటితో కడిగేయండి.

ఈ ఫేస్ ప్యాక్ మీ ఫేస్‌పై ఉన్న అదనపు జిడ్డును తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అయితే ఇది ముడతలను పూర్తిగా తొలగిస్తుందని గ్యారెంటీ లేదు. సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ ప్యాక్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.(Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు. ఇవి వాడే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి.