
మదర్స్ డే రోజు చాలా మంది తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే, ఈ సారి కొత్తగా వందల ఏళ్లనాటి అంతరించిపోయిన ఈ స్వీట్‌తో అమ్మను సర్‌ప్రైజ్ చేయండి. దీనిని పాత రోజుల్లో పండుగల సమయంలో చేసే వాళ్ళు. ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోతోంది. ఇంకా ఇది రుచిగా కూడా ఉంటుంది.

పాల పూరికి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు గోధుమ పిండి, రుచికి తగినంత ఉప్పు, రెండు గ్లాసుల నీరు, అర కప్పు నూనె, పాలు మిశ్రమం కోసం ఒక లీటర్ పాలు , ఒక కప్పు చక్కెర లేదా ఒక కప్పు బెల్లం తురుము, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పు, 5 కిస్మిస్ లు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి.

పాల పూరి తయారీ విధానం : ముందుగా పిండిని బాగా కలుపుకోవాలి: ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి, అలాగే, దీనిలో కొద్దిగా నీరు పోస్తూ దీనిని బాగా కలుపుకోవాలి. అలా అని దీనిని ముద్దలాగా కలుపుకోవాలి. ఇంకా ఈ ముద్దను 30 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత పూరీలలా చేసుకోవాలి

పూరీలు వేయించుకోవాలి: గ్యాస్ వెలిగించి పాన్‌లో ఆయిల్ వేసి, అది బాగా వేడయ్యాక ఈ పూరీలను గోల్డ్ కలర్లోకి మారే వరకు వీటిని బాగా వేయించాలి. ఆ తర్వాత వీటిని పక్కన ఉంచాలి. ఇంకా పాలు వేరే పాత్రలో తీసుకుని దానిలో చక్కెర లేదా బెల్లం వేసి బాగా మరిగించాలి. ఇంకా దీనిలో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి

పూరీలను ఇలా నానబెట్టుకోవాలి: వేయించిన పూరీలను ఈ పాల మిశ్రమంలో వేసి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పూరీలు పాలను పీల్చుకునే వరకు అలాగే ఉంచండి. అవి మెత్తగా అవుతాయి. అంతే పాలు పూరి రెడీ. దీనిని వేడిగా లేదా చల్లగా కూడా తినొచ్చు. అలాగే, ఫ్రిజ్‌లో 10 నిముషాలు పెట్టి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది.