
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, జంతువులు, కీటకాలు మనకు కనిపించే విధానాన్ని బట్టి కొన్ని శకునాలు ఉంటాయని నమ్ముతారు. శకున శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేవగానే గోడపై ఉన్న బల్లిని చూడటం చాలా మంచిది. ఇది మీరు చేపట్టబోయే పనుల్లో విజయం లభిస్తుందని చెప్పడానికి ఒక సూచన.

నిద్రలేవగానే బల్లి కనిపిస్తే అకస్మాత్తుగా ధన లాభం కలిగే అవకాశం ఉందని నమ్ముతారు. బల్లి గోడపై కింది నుండి పైకి పాకుతూ కనిపిస్తే, అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారంలో లాభాలకు సంకేతం. పురాణాల ప్రకారం బల్లిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో బల్లి కనిపిస్తే నమస్కరించుకునే ఆచారం కూడా ఉంది.

ఇకపోతే, అన్ని వేళలా బల్లి కనిపించడం శుభం కాదు. కొన్ని సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలి. బల్లి గోడపై నుండి కిందికి వేగంగా పాకడం చూస్తే, అది ధన నష్టానికి లేదా పనుల్లో ఆటంకాలకు సంకేతం కావచ్చు. శరీరంపై బల్లి పడటంపై ప్రత్యేకమైన బల్లి శాస్త్రం ఉంది. కుడి భాగంపై పడితే ఒక రకమైన ఫలితం, ఎడమ వైపు పడితే మరో ఫలితం ఉంటుందని చెబుతారు.

రెండు బల్లులు పోట్లాడుకోవడం చూస్తే, అది బంధువులతో లేదా మిత్రులతో గొడవలకు సూచిక. శాస్త్రీయంగా బల్లులు క్రిమి కీటకాలను తింటూ పర్యావరణానికి మేలు చేస్తాయి. ఆధ్యాత్మికంగా చూస్తే, బల్లి కనిపించడం అనేది మనలో ఒక రకమైన అప్రమత్తతను పెంచుతుంది. ఇలాంటి శకునాలపై నమ్మకం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.

అలాగే ఉదయం లేవగానే ఆవును చూడటం చాలా మంచిది. ముఖ్యంగా గోమాత, తల్లి పాలు తాగుతున్న లేగ దూడ విగ్రహం. ఆవును చూడటం వలన అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. ఇది ఇంటిలో ఆనందం, శ్రేయస్సును, చేసే పనుల్లో విజయాన్ని కూడా సూచిస్తుందంట. అందువలన ఎవరు అయితే లేచిన వెంటనే గోమాతను చూస్తారో వారు చాలా అదృష్టవంతులు. ఎవరు అయితే ఉదయం లేచిన వెంటనే నెమలి కన్నుల చిత్రాలు లేదా, పువ్వులను చూస్తారో వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రోజు అనుకోని విధంగా ప్రయోజనాలు పొందుతారు అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.