
కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు పచ్చి బియ్యం వీటిని అరగంట పాటు నానబెట్టుకోవాలి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, నాలుగు మిరియాలు 1.5 నుంచి 2 టేబుల్ స్పూన్లు కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా కొంచం కొబ్బరి పాలు, నీళ్లు 3 కప్పులు, తాలింపు కోసం అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, 10 జీడిపప్పులు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ, ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి.

మొలహోర తయారీ విధానం : అన్నం ఉడికించడం: ఇంకా నానబెట్టిన బియ్యాన్ని తీసుకుం మంచిగా కడిగి, ఇంకా కొబ్బరి పాలు, నీళ్లు, కొద్దిగా ఉప్పు, అన్నం మెత్తగా కాకుండా పొడిపొడిగా ఉంటే మంచిగా ఉంటుంది బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉంటేనే తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది.

మొలహోర తయారీ విధానం స్టెప్ 1 : మిరియాల పొడిని చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పాన్ లో కొద్దిగా మిరియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మీడియం మంటపై మంచి సువాసన వచ్చేవరకు వేయించి, దీనిని చల్లారాక ఇంకా బరకగా దీనిని పొడి లాగా చేసుకోవాలి.

మొలహోర తయారీ విధానం స్టెప్ 2 తాలింపు: ఇప్పుడు మరో పాన్ లో నెయ్యి వేసి దీనిలో 4 జీడిపప్పులు వేసి మంచిగా వేయించాలి. ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, న;నాలుగు కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి తాలింపు లాగా దీనిని వేయించాలి.

మొలహోర తయారీ విధానం స్టెప్ 3 : ఇప్పుడు దీనిలో ఉడికించి చల్లార్చిన అన్నంలో పొడిలా చేసుకున్న మిరియాలు-జీలకర్ర పొడి, తాలింపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి .. ఇంకా అన్నం అసలు విరిగిపోకుండా దీనిని కొంచం మంచిగా కలుపుకోవాలి.అప్పుడే ఇది రుచిగా ఉంటుంది.