పుదీనా ఆకులు జీర్ణక్రియను మెరుగుపరచి అజీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. పుదీనాలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పుదీనా ఆకులలో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి.
పుదీనా ఆకులు కొవ్వు కరిగించేందుకు ఉపయోగపడతాయి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. రోజూ పుదీనా తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది, నోటిని తాజాగా ఉంచుతుంది. పుదీనా వాసన మెదడుకు శాంతిని కలిగించి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ప్రతిరోజూ పుదీనా ఆకులు తినడం శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి ఏదో ఒక విధంగా దీన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. పుదీనాలో యాంటీఆక్సిడెంట్లు, మెంథాల్, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎంజైమ్‌లు ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇవి సహాయపడతాయి. పుదీనా ఆకులను నమలడం వల్ల నోరు శుభ్రపడుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
పుదీనాలో ఉన్న నూనెలు యాంటీ బ్యాక్టీరియల్, క్రిమినాశక ప్రభావాలను కలిగి ఉండటం వల్ల జీర్ణాశయాన్ని శాంతపరుస్తూ ఆమ్లత్వం, అపానవాయువులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఊపిరితిత్తులలో ఉన్న శ్లేష్మాన్ని బయటకు పంపి సులభంగా ఊపిరి పీల్చుకోవాటానికి దోహదం చేస్తుంది. అయితే పుదీనాను అధిక మోతాదులో తీసుకుంటే ఊపిరితిత్తుల వాయు మార్గాల్లో మంట పుట్టవచ్చు. పుదీనాను తరచూ తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
పుదీనాలో ఉండే బ్యాక్టీరియాలను సంహరించి, శోథను తగ్గించే పదార్థాలు చర్మంపై ఉన్న మొటిమలను నివారించడంలో సహాయపడతాయి. దీనితో పాటు అధిక మొత్తంలో ఉన్న సలిసిలిక్ ఆమ్లం చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. అలాగే, ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు మలిన పదార్థాలను తొలగిస్తాయి. పుదీనా చర్మంలోని తేమను సంరక్షించి, మృత కణాలను తొలగించి, స్వేద రంధ్రాల నుంచి మలినాలను బయటకు పంపడం వల్ల చర్మం ప్రకాశవంతంగా, బిగుతుగా మారుతుంది.