
చామదుంపల ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు : చామ దుంపలు, కరివేపాకు, లవంగాలు, ధనియాల పొడి, మెంతి పొడి, తురిమిన పచ్చి మిర్చి, కారం పొడి, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ రెబ్బలు, పసుపు, కరివేపాకు, నూనె, ఉల్లిపాయ.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా చామ దుంపలు తీసుకోవాలి. వాటిని నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో చామదుంపలు వేసి, కొంచెం ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడక బెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లుల్లిరెబ్బలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన చామ దుంపలు తీసుకొని, వాటిలో కారం, గరం మాసాలా, మెంతిపొడి, ధనియాల పొడి, చిటికెడు పసుపు , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటిని బాగా కలిపి దాదాపు 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కారం , ఉప్పు కలిపిన చామదుంపలను తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో డీప్ ఫ్రైకి సరప నూనెపోసుకోవాలి. అందులో మనం కలిపి పెట్టుకున్న చామ దుంపలు వేసుకోవాలి. వాటిని నూనెలో మంచిగా వేయించుకోవాలి.

కాస్త వేగిన తర్వాత అందులో మరో స్పూన్ కారం, కొత్తిమీర, కరివేపాకు రెబ్బలు వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బంగారు రంగు వచ్చి, అవి కర కరమనే వరకు వేయించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చామదుంపల ఫ్రై రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే దీని రుచి అదిరిపోతుంది.