Variyali Sharbat: వేసవిలో సోంపు షర్బత్ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు.. ఎలా తయారు చేయాలంటే..
వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో వేడిని తట్టుకోవడానికి.. చాలామంది శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో చక్కెర అధికంగా ఉండే అనారోగ్యకరమైన పానీయాలకు బదులుగా, మీరు కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి మీరు ఈ పానీయాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. వేసవి తాపానికి చక్కటి పానీయం (వరియాలి) సోంపుల షర్బత్.