Leftover Rice Manchurian: మిగిలిన అన్నంతో టేస్టీ మంచూరియా రెసిపీ.. ఎలా చేయాలంటే.?

Updated on: Jul 09, 2025 | 8:48 PM

చాలామంది ఇళ్లలో లంచ్ తర్వాత అన్నం మిగిలిపోతుంది. దాన్ని వేస్ట్ చేయకుండా ఈ సింపుల్‎గా రుచికరమైన మంచూరియా రెసిపీ చేసుకోవచ్చు. ఇది చాల టేస్టీగా మీ ఇంట్లో అందరికి నచ్చేలా ఉంటుంది. మిగిలిన అన్నాన్ని ఉపయోగించుకుని, టేస్టీ అండ్ స్పైసీ మంచూరియాను ఎలా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందామా మరి. 

1 / 5
మంచూరియా రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు:  మిగిలిన అన్నం  (సుమారు ఒక కప్పు), ఒక క్యాప్సికం, ఒక క్యారెట్, రెండు పచ్చిమిర్చి, ఓక్ పెద్ద ఉల్లిపాయ, ఉప్పు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, కార్న్‌ఫ్లోర్, నిమ్మకాయ, నూనె, వెల్లుల్లి, టమాట, టొమాటో కెచప్ 

2 / 5
ముందుగా, మిగిలిన అన్నాన్ని తీసుకొని, మిక్సీ జార్‌లో వేసి, నీరు ఏమీ కలపకుండా మెత్తగా గ్రైండ్ చేయాలి. అన్నం ముద్దలాగా మారాలి. ఒక పెద్ద బౌల్‌లో గ్రైండ్ చేసిన అన్నాన్ని తీసుకొని సన్నగా తరిగిన క్యాప్సికం, క్యారెట్, పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయ వేయాలి.  ఇప్పుడు, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు (ఒక స్పూన్), కారం (ఒక స్పూన్), ధనియా పొడి (అర స్పూన్), జీలకర్ర పొడి (పావు స్పూన్), మైదా (అర కప్పు), కార్న్‌ఫ్లోర్ (రెండు స్పూన్లు) కలపాలి. చివరగా, అర నిమ్మరసం కలపాలి. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌గా చేయాలి. చేతులకు కొంచెం నూనె రాసుకుంటే బాల్స్ సులభంగా తయారవుతాయి.

3 / 5
తర్వాత ఒక పాన్‌లో నూనె వేసి బాగా వేడి చేయాలి. తర్వాత తయారు చేసుకున్న బాల్స్‌ను వేడి నూనెలో వేసి, మీడియం ఫ్లేమ్‌లో 10-15 నిమిషాల పాటు, గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంతవరకు ఫ్రై చేయాలి. జాగ్రత్తగా తిప్పుతూ ఫ్రై చేయాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టండి. 

4 / 5
తర్వాత వేరే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, సన్నగా తరిగిన ఐదు వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ వేసి, 2-3 నిమిషాలు ఫ్రై చేయాలి. సన్నగా తరిగిన క్యాప్సికం, తురిమిన క్యారెట్ వేసి, బాగా ఫ్రై చేయాలి. తర్వాత సన్నగా తరిగిన టమాట వేసి, బాగా ఫ్రై చేయాలి. అందులో ఉప్పు (అర స్పూన్), కారం (అర స్పూన్), గరం మసాలా (అర స్పూన్), చాట్ మసాలా (అర స్పూన్) వేసి, కలపాలి. నాలుగు స్పూన్లు టొమాటో కెచప్ వేసి, ఒక నిమిషం సాటే చేయాలి. కుదిరితే సోయా సాస్, వినెగార్, చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు.

5 / 5
తర్వాత మీరు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్‌ను సాస్‌లో వేసి లో ఫ్లేమ్‌లో ఒకటి లేదా రెండు నిమిషాలు కలపాలి. అంతే వేడి వేడిగా రుచికరమైన మంచూరియా తినడానికి సిద్ధంగా ఉంటుంది. 