
ఈ మధ్య కాలంలో గ్యాస్ బుకింగ్ విషయంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే.. అది గ్యాస్ బుక్ చేసే సందర్భంలో రిజిస్టర్ మొబైల్‌కు ఓటిపి రాకపోవడం, లేదా లేట్‌గా రావడం. ఇది వినియోగదారుల ఆందోళనను పెంచింది. ఎందుకంటే ఓటీపీ లేకుండా సిలిండర్ బుకింగ్ అనేది పూర్తి కాదు. అయితే ప్రతిసారి ఈ ఓటీపి రాకపోవడానికి కేవలం కంపెనీ సర్వర్ మాత్రమే కాకపోవచ్చు. కొన్ని సార్లు మన ఫోన్‌లోని సెట్టింగ్స్ వల్ల కూడా ఓటిపి రాకపోవచ్చు. కాబట్టి ఈ ఓటీపీ సమస్యను ఎలా అదిగమించాలో ఇక్కడ సిపుల్‌గా తెలుసుకుందాం.

నెట్‌వర్క్ సమస్య: వినియోగదారులు నెట్‌వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నప్పుడు లేదా ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయనప్పుడు గ్యాస్ కంపెనీ పంపే OTP ఆలస్యంగా రావడం లేదా అసలు రాకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో సర్వర్, నెట్‌వర్క్ వేగం రెండూ మందగిస్తాయి. మీ మొబైల్‌లో సిగ్నల్ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయండి. ఒకవేళ సిగ్నల్ తక్కువగా ఉంటే, ఫోన్‌ను ఒక్కసారి ఏర్‌ప్లేన్ మోడ్ లో పెట్టి, ఆ తర్వాత ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల నెట్‌వర్క్ రిఫ్రెష్ అయి సిగ్నల్ అందుతుంది.

DND ఫీచర్ ఆన్‌లో ఉండటం: చాలామంది స్మార్ట్‌ఫోన్‌లలో డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఆన్‌లో ఉంటుంది.ఈ ఫీచర్ ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజ్‌లు, నోటిఫికేషన్‌లను నిలిపివేస్తుంది. దీనివల్ల గ్యాస్ బుకింగ్ OTP మెసేజ్ కూడా బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి DND ఫీచర్ ఆన్‌లో ఉందో లేదో చూడండి ఉంటే దానిని వెంటనే ఆఫ్ చేయండి.

గ్యాస్ కంపెనీ సర్వర్ డౌన్: కొన్నిసార్లు సమస్య మీ ఫోన్‌తో కాకుండా గ్యాస్ కంపెనీ సర్వర్‌తో ఉండవచ్చు. ఒకే సమయంలో వేలాది మంది వినియోగదారులు సిలిండర్లను బుక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, సాంకేతిక కారణాల వల్ల సర్వర్ డౌన్ అవుతుంది. దీనివల్ల OTP పంపే ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతుంది. ఇది సాంకేతిక సమస్య కాబట్టి, కాస్త సమయం ఆగి మళ్లీ బుకింగ్‌కు ప్రయత్నించడం మంచిది.

ఇన్‌బాక్స్ ఫుల్: ఫోన్‌లోని పాత SMSలను క్రమంగా డిలీట్ చేయకపోవడం వల్ల ఇన్‌బాక్స్ పూర్తిగా నిండిపోతుంది. దీనివల్ల కొత్తగా వచ్చే మెసేజ్‌లకు స్థలం లేక, గ్యాస్ బుకింగ్ OTPలు కూడా ఫోన్‌కు చేరవు. మీ మొబైల్ మెసేజ్ ఇన్‌బాక్స్‌ను ఒకసారి పరిశీలించి, అనవసరమైన పాత మెసేజ్‌లను డిలీట్ చేయండి. స్థలం ఖాళీ అవ్వడం వల్ల OTPలు వెంటనే అందుతాయి.

స్పామ్ ఫిల్టర్‌లో చిక్కుకోవడం: ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే స్పామ్ ప్రొటెక్షన్ ఫీచర్, కొన్ని తెలియని నంబర్ల నుండి వచ్చే మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా స్పామ్ లేదా జంక్ ఫోల్డర్‌కు పంపేస్తుంది. పొరపాటున OTP మెసేజ్ కూడా అందులోకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ సాధారణ ఇన్‌బాక్స్‌లోకి OTP రాకపోతే, మెసేజ్ యాప్‌లోని Spam or Blocked ఫోల్డర్‌ను ఒకసారి తనిఖీ చేయండి.