పౌడర్ vs లిక్విడ్.. వాషింగ్ మెషీన్‌లో ఏది వేయాలి..? అందరూ చేసే తప్పులు ఇవే..

Updated on: Aug 14, 2026 | 7:06 PM

నేటి ఉరుకుల పరుగుల జీవనంలో వాషింగ్ మెషీన్ ప్రతి ఇంటా నిత్యావసర వస్తువుగా మారిపోయింది. బట్టలను శ్రమ లేకుండా సులభంగా ఉతకడానికి ఏళ్ల తరబడి మెషీన్లను వాడుతున్నప్పటికీ, వాటి నిర్వహణ, దీర్ఘకాలిక మన్నికకు సంబంధించిన కీలక అంశాలపై చాలా మందికి సరైన స్పష్టత ఉండటం లేదు. ముఖ్యంగా మెషీన్‌లో వాడే డిటర్జెంట్ ఎంపిక విషయంలో చాలా మంది నిత్యం అయోమయానికి గురవుతుంటారు.

1 / 5
వాషింగ్ మెషీన్ వాడే ప్రతి ఒక్కరిలోనూ లిక్విడ్ డిటర్జెంట్ వాడాలా లేక పౌడర్ డిటర్జెంట్ వాడాలా అనే డౌట్ ఉంటుంది. ఈ రెండింటిలో సరైనదాన్ని ఎంచుకోవడం కేవలం బట్టల శుభ్రతకే కాకుండా వేల రూపాయల విలువైన మీ వాషింగ్ మెషీన్ జీవితకాలాన్ని పెంచడానికి కూడా ఎంతో కీలకం. హోమ్ అప్లయన్సెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం.

2 / 5
సాధారణంగా బట్టలపై మురికిని వదిలించడంలో లిక్విడ్, పౌడర్ డిటర్జెంట్లు రెండూ సమర్థవంతంగా పనిచేస్తాయి. అయినప్పటికీ మెషీన్ అంతర్గత భాగాల రక్షణ, ఆధునిక వాషింగ్ టెక్నాలజీని పరిగణనలోకి తీసుకుంటే పౌడర్ కంటే లిక్విడ్ డిటర్జెంట్‌నే మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. వాషింగ్ నాణ్యతలో లిక్విడ్ అందించే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

3 / 5
నీటిలో వేగంగా కరిగిపోయే స్వభావం ఉండటం వల్లే లిక్విడ్ డిటర్జెంట్‌కు ప్రాధాన్యత పెరిగింది. పౌడర్ డిటర్జెంట్ చల్లని నీటిలో పూర్తిగా కరగకపోవడం వల్ల బట్టల మడతల్లో తెల్లటి మచ్చలుగా లేదా గరుకుగా పేరుకుపోయే అవకాశం ఉంది. అదే లిక్విడ్ డిటర్జెంట్ అయితే తక్షణమే నీటిలో కలిసిపోయి దుస్తుల ఫైబర్‌లలోకి సులభంగా చొచ్చుకుపోతుంది. తద్వారా బట్టలపై ఎలాంటి మరకలు మిగలకుండా మెరుపును కాపాడుతుంది.

4 / 5
విద్యుత్, నీటి ఆదా విషయంలోనూ లిక్విడ్ డిటర్జెంట్ ముందంజలో ఉంటుంది. పౌడర్ వాడినప్పుడు బట్టలకు అంటుకున్న సబ్బు అవశేషాలను పూర్తిగా తొలగించేందుకు అదనపు రిన్స్ , స్పిన్ సైకిల్స్ అవసరమవుతాయి. దీనివల్ల ఎక్కువ నీరు, కరెంట్ వృథా అవుతాయి. అదే లిక్విడ్ వాడితే మొదటి సైకిల్‌లోనే నురుగు త్వరగా కొట్టుకుపోయి విలువైన సమయంతో పాటు విద్యుత్ బిల్లు కూడా ఆదా అవుతుంది.

5 / 5
అన్నింటికంటే ముఖ్యంగా వాషింగ్ మెషీన్ డ్రైనేజీ పైపులు, ఇంటర్నల్ డ్రమ్ బ్లాక్ అవ్వకుండా కాపాడటంలో లిక్విడ్ డిటర్జెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. పౌడర్ కణాలు కాలక్రమేణా పైపుల గోడలకు జిగురులా పేరుకుపోయి మురుగునీటి వ్యవస్థను అడ్డుకుంటాయి. లిక్విడ్ డిటర్జెంట్‌తో ఈ సమస్య పూర్తిగా తొలగిపోయి, మెషీన్ అంతర్గత భాగాలు క్లీన్‌గా ఉంటూ ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా సుదీర్ఘ కాలం మన్నుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us