
దంత సమస్యలు ఉన్నవారు: నిమ్మకాయలోని సిట్రిక్ ఆమ్లం దంతాల ఎనామిల్‌ను బలహీనపరుస్తుంది. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు లేదా దంతాల సున్నితత్వం ఉన్నవారు లెమన్ టీ తాగితే పళ్లు మరింత దెబ్బతింటాయి.

అసిడిటీ, గ్యాస్ సమస్యలు: అసిడిటీ, గ్యాస్ట్రిక్ లేదా అల్సర్ సమస్యలు ఉన్నవారు లెమన్ టీకి పూర్తిగా దూరంగా ఉండాలి. నిమ్మ, టీ కలవడం వల్ల ఆమ్ల పరిమాణం పెరిగి కడుపులో మంట, ఎసిడిటీ విపరీతంగా పెరుగుతాయి.

మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పి: కొంతమందిలో సిట్రస్ పదార్థాలు తలనొప్పిని లేదా మైగ్రేన్‌ను ట్రిగ్గర్ చేస్తాయి. తరచూ తలనొప్పి సమస్యతో బాధపడేవారు లెమన్ టీ తాగడం మంచిది కాదు.

ఎముకల బలహీనత: నిమ్మకాయ మూత్రం ద్వారా శరీరం నుండి కాల్షియంను బయటకు పంపిస్తుంది. అలాగే ఇది శరీరంలో అల్యూమినియం శోషణను పెంచుతుంది. ఇది ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. షుగర్, హై బ్లడ్ ప్రెజర్ వంటి దీర్ఘకాలిక సమస్యల కోసం నిత్యం మందులు వాడేవారు లెమన్ టీ తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

అధిక ఆమ్ల కంటెంట్ కలిగించే దుష్ప్రభావాలు: టీ, నిమ్మకాయ రెండూ ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. ఈ రెండింటి కలయిక శరీరంలో యాసిడ్ స్థాయిలను ప్రమాదకర స్థాయిలో పెంచుతుంది. ఇది జీవక్రియను దెబ్బతీసి, శరీరంలో నీటి సమతుల్యతను కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి, ఆరోగ్య ప్రయోజనాల కోసం లెమన్ టీని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ఏదైనా మితంగా తీసుకున్నప్పుడే శరీరానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.