Kitchen Hacks: కలిపిన చపాతీ పిండి మిగిలిపోయిందా.. ఇలా స్టోర్ చేయవచ్చు!

|

Nov 14, 2024 | 5:59 PM

చపాతీ పిండి ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటుంది. కొంత మంది ఒక రోజు ఉంచి పడేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పే విధంగా చపాతీ పిండిని స్టోర్ చేస్తే.. ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది..

1 / 5
ఈ మధ్య కాలంలో చాలా మంది చపాతీలనే ఎక్కువగా తింటున్నారు. చపాతీలు తినడం వల్ల బరువు పెరగకుండా ఉంటామని అనుకుంటున్నారు. చపాతీలు కూడా మితంగా తింటేనే ఆరోగ్యం. అయితే ఒక్కోసారి చపాతీ పిండి కలిపినప్పుడు మిగిలిపోతూ ఉంటుంది.

2 / 5
ఈ కలిపిన పిండిని ఎలా స్టోర్ చేయాలో తెలీక చాలా మంది నిల్వ ఉంచడం ఎందుకులే అని పడేస్తారు. కానీ అలా పడేయటం కంటే ఈ పిండిని చక్కగా నిల్వ చేసుకోవచ్చు. రెండు రోజుల్లోపు ఈ పిండి వాడుకోవచ్చు.

3 / 5
అయితే పాలు వేసి కలిపిన పిండి మాత్రం నిల్వ చేయకూడదు. అది త్వరగా పాడైపోతుంది. కేవలం నీళ్లు వేసిన చపాతీ పిండి మాత్రమే నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

4 / 5
చపాతీ పిండిని నిల్వ ఉంచాలి అంటే అందులో కొద్దిగా నెయ్యి లేదా నూనె ఎక్కువగా వేసి కలపాలి. ఇలా చేస్తే చపాతీలు సాఫ్ట్‌గానే కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అదే విధంగా అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఉంచినా కూడా పిండి తాజాగా ఉంటుంది.

5 / 5
అలాగే ఎయిర్ టైట్ కంటైనర్‌లో నిల్వ ఉంచిన కూడా పిండి త్వరగా పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. చపాతీ పిండికి గాలి తగిలినా, తేమ తగిలినా వెంటనే పాడైపోతుంది. కాబట్టి జిప్ లాక్ కవర్స్‌లో కూడా ఉంచుకోవచ్చు.