
భారీ తగ్గుదల తర్వాత తాజా నివేదికల ప్రకారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కొన్ని కూరగాయల ధరలు స్థిరంగా ఉండగా, పచ్చిమిర్చి వంటి వాటి ధరలు స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇక వరుసగా ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు చూసుకుంటే కేజీ టామోటా రూ.10 నుంచి 15 మధ్య ఉండగా, వంకాయ ధర రూ.15-20 మధ్య కొనసాగుతుంది.

ఇక కూకట్‌పల్లి మార్కట్‌లో కేజీ బెండకాయ రూ.28 - 35 మధ్య పలుకుతుండగా పచ్చి మిర్చి ధర రూ. 35 - 45 మధ్య కొనసాగుతుంది. అలాగే కేజీ బీరకాయ ధర రూ. 35 - 50 మధ్య ఉండగా, కేజీ క్యారెట్ 25 - 30 వద్ద కొనసాగుతుంది.

ఇక కిలో ఆలుగడ్డ రూ.17- 25 మధ్య కొనసాగుతుండగా కేజీ ఉల్లిగడ్డ ధర రూ.18 నుంచి 22 మధ్య కొనసాగుతుంది. అలానే కాకరకాయ ధర రూ. 35 నుంచి 45 మధ్య కొనసాగుతుండగా కీర దోస ధర రూ.15 - 18 వద్ద స్థిరపడింది. ఇక ఆకు కూరల విషయానికి వస్తే కట్ట 15-20 రూపాయల మధ్య ఉంది.

అయితే కొంత మంది పెద్ద వ్యాపారులు నేరుగా హోల్‌సెల్ మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి బోయినపల్లి హోల్ సేల్ మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హోల్‌సెల్ మార్కెట్ కాబట్టి ఇక్కడ కూరగాయలను క్వింటాల్ లెక్కను విక్రయిస్తారు. అయితే ప్రస్తుతం ఇక్కడ క్వింటాల్ బీట్‌రూట్ ధర రూ. 1,100 గా ఉండగా, చిక్కుడుకాయ రూ. 2,000, క్యాప్సికం రూ.2,500, మునక్కాయ రూ. 2,500గా కొనసాగుతుంది.

Note: అయితే పైన పేర్కొన్న ధరలు మార్కెట్‌కు సరుకు వచ్చే పరిమాణాన్ని బట్టి ఉదయం నుంచి సాయంత్రం లోపు స్వల్పంగా మారవచ్చు. రైతుబజార్లలో ధరలు సాధారణంగా బయట రిటైల్ షాపుల కంటే 20 శాతం వరకు తక్కువగా ఉండవచ్చు. కాబట్టి వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే స్థానిక మార్కెట్‌లకు వెళ్లి ధరలు తెలుసుకోండి.