అడవే ప్రపంచంగా జీవిస్తున్న కొండరెడ్డి గిరిజనుల అద్భుత సంస్కృతి

Edited By:

Updated on: May 26, 2026 | 3:46 PM

ఆధునిక ప్రపంచపు అలికిడికి దూరంగా, దట్టమైన అడవులు, ఎత్తైన కొండకోనల మధ్య సాగే గిరిజన జీవన విధానం ఎప్పుడూ విలక్షణమైనదే. పచ్చని ప్రకృతిని నమ్ముకుని బతికే గిరిపుత్రుల సంస్కృతి, వారి ఆచార వ్యవహారాలు నిఖార్సైన మానవీయ విలువలకు అద్దం పడతాయి. . ముఖ్యంగా ఏలూరు జిల్లా బుట్టాయగూడెం..

1 / 5
ఆధునిక ప్రపంచపు అలికిడికి దూరంగా, దట్టమైన అడవులు, ఎత్తైన కొండకోనల మధ్య సాగే గిరిజన జీవన విధానం ఎప్పుడూ విలక్షణమైనదే. పచ్చని ప్రకృతిని నమ్ముకుని బతికే గిరిపుత్రుల సంస్కృతి, వారి ఆచార వ్యవహారాలు నిఖార్సైన మానవీయ విలువలకు అద్దం పడతాయి. ముఖ్యంగా ఏలూరు జిల్లా బుట్టాయగూడెం పరిసర ప్రాంతాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో నివసించే 'కొండరెడ్డి' గిరిజనుల జీవన శైలి భిన్నమైనది. బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేకపోయినా, తరతరాలుగా వస్తున్న తమ సాంప్రదాయాలను వారు ప్రాణప్రదంగా కాపాడుకుంటున్నారు. సరిగమల గురించిన శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోయినా, ప్రకృతి అందించిన శబ్దాలనే రాగాలుగా మలచుకుంటూ సాగే వారి జీవన ప్రయాణం అద్భుతమనే చెప్పాలి.

2 / 5
అడవి తల్లి అందించిన స్వరాలు.. పండగల్లో లయబద్ధ నృత్యాలు: నేటి ఆధునిక కాలంలో డిస్కో, బ్రేక్ డాన్స్, స్నేక్ డాన్స్ వంటి పాశ్చాత్య నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం లాంటి శాస్త్రీయ నృత్యాలు ప్రపంచాన్ని ఊపేస్తున్నా, కొండరెడ్డి గిరిజనులకు మాత్రం వాటితో ఎటువంటి ప్రమేయం లేదు. చుట్టూ ముసిరిన కొండలు, జలజలా పారే వాగుల సవ్వడులే వారి నృత్యానికి ప్రేరణ. అడవి తల్లి నేర్పిన లయకు అనుగుణంగా అడుగులు వేస్తూ వారు చేసే నృత్యాలు చూసేవారిని కట్టిపడేస్తాయి. గిరిజన గ్రామాల్లో జరిగే వివాహాది శుభకార్యాల్లోనూ, పండుగ పబ్బాల్లోనూ ఈ లయబద్ధమైన నృత్యాలు వారి సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తాయి. కోయిలల కుహూకుహూలు, సెలయేళ్ల గలగలలను మరిపిస్తూ సాగే గిరిపుత్రుల పాటలు, ఆటలు వారి నిష్కల్మషమైన ఆనందాన్ని చాటిచెబుతాయి.

3 / 5
కొండరెడ్డి గిరిజనుల సాంప్రదాయ వాయిద్యాలు: సొంత నైపుణ్యానికి నిదర్శనం గిరిజన సంస్కృతిలో సంగీత వాయిద్యాలకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే, ఈ వాయిద్య పరికరాల కోసం వారు పట్టణాలకో, మార్కెట్లకో వెళ్లరు. తమకు కావలసిన సంగీత పరికరాలను అడవిలో లభించే వనరులతో స్వయంగా తయారు చేసుకునే అద్భుతమైన నైపుణ్యం వీరి సొంతం. అడవిలో సహజంగా దొరికే ఉమ్మేటెక్కు, వేగిస చెట్ల దుంగలను తెచ్చి, వాటిని గుల్లగా (తొర్రలా) తొలిచి ఢప్పుల నమూనాలను తయారు చేస్తారు. వీటికి మేక చర్మాలను అమర్చి అందమైన వాయిద్యాలుగా రూపుదిద్దుతారు. వీటితో పాటు అడ్డతీగ గిల్లలను గుత్తులుగా కట్టి ప్రత్యేకమైన శబ్దాలు పలికిస్తారు. మహిళలు ఈ అడ్డతీగ గిల్లల గుత్తులను చేతబూని, వాటిని ఊపుతూ లయబద్ధమైన చప్పుడుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేయడం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

4 / 5
కోయ తెగ 'రేల' పాటలు.. జొన్నకూడు ఉత్సవాల సందడి : కొండరెడ్డి గిరిజనులతో పాటు ఏజెన్సీలో నివసించే కోయ తెగ ప్రజల సంస్కృతి కూడా ఎంతో సంపన్నమైనది. వీరు పాడే 'రెరె.. రెరెలా.. రేలా.. రేలా..' అంటూ సాగే రేలా పాటలు గిరిజన జీవన సౌరభాన్ని వెదజల్లుతాయి. ముఖ్యంగా కొండరెడ్లు జొన్న పంట చేతికి వచ్చే సమయంలో 'జొన్నకూడు.. జొన్నవిల్లు.. జొన్నకూలితే.. పోతేనత్త' అంటూ కొత్త పంటల పండుగలను వైభవంగా జరుపుకుంటారు. పసుపు పచ్చ పండుగ, మామిడి పండుగ, చింత పండుగ, భూదేవి పండుగలలో ఈ సాంప్రదాయ నృత్యాలు ఊపందుకుంటాయి. అలాగే పెళ్లిళ్ల సమయంలో 'కళ్ళేడమ్మ.. కళ్ళేడమ్ము.. గోగులపిల్లకు.. కెవ్వెల పెళ్లోడు' అంటూ వరుసపాటలు పాడుతూ పెళ్లి ఇళ్లలో ఆనందోత్సాహాలను నింపుతారు.

5 / 5
గిరిజన గ్రామాల్లో వేసవి వేడుకలు: మారుమోగుతున్న డోలు, కొయ్యల వాయిద్యాలు: ప్రస్తుత వేసవి కాలంలో గిరిజన పల్లెలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. మండుటెండలను సైతం లెక్కచేయకుండా గిరిజన గ్రామాల్లో డోలు, కొయ్యల వాయిద్యాల మోత మారుమోగుతోంది. తరతరాలుగా తమకు వస్తున్న ఆచారం ప్రకారం ఈ వేసవిలోనే వారు బాట పండుగ, మామిడికాయ పండుగలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. వన దేవతలను పూజిస్తూ సాగే ఈ ఉత్సవాలతో ఏజెన్సీ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. పల్లెల్లో డోలు కొడుతూ, రేలా పాటలు పాడుతూ, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ గిరిజనులు సాగించే ఈ వేడుకలు బాహ్య ప్రపంచం నుండి వచ్చే సందర్శకులకు సరికొత్త అనుభూతిని, కనువిందును కలిగిస్తున్నాయి. అమాయకత్వమే ఆభరణంగా, ప్రకృతి ప్రసాదించిన వనరులే జీవన లయగా సాగుతున్న వీరి సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

Follow Us