కోనసీమ స్టైల్.. మామిడికాయ, ఎండు చేపల కర్రీ.. రుచికి ఫిదా అవుతారంతే!

Updated on: Mar 31, 2026 | 6:59 PM

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది మామిడికాయలు తినడమే కాకుండా, మామిడి కాయలతో అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. ఇక చాలా మంది మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర చేస్తుంటారు. కానీ మామిడికాయలు, ఎండు చేపల కర్రీ వండితే టేస్ట్ అదిరిపోతుందంట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : ఎండు చేపలు, కప్పు మామిడికాయ ముక్కలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఎండు మిర్చి, కరివేపాకు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతి పొడి, నూనె, ఉప్పు, రుచికి సరిపడ కారం, వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి పొడి, కొత్తిమీర తరుగు.

2 / 5
తయారీ విధానం : ముందుగా ఎండు చేపలు తీసుకోవాలి వాటి తలలు తీసి వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత వీటిని మరిగే నీటిలో వేసి, తీసి చల్లటి నీటిలో వేసి, బాగా కలుపుకోవాలి. దీని వల అందులో ఉన్న ఇసుక రేణువులు అన్నీ పోతాయి.

3 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టుకోవాలి. తర్వాత అందులో నూనె సరిపడ వేసుకోవాలి. తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఎండు మిర్చి, పచ్చి మిర్చీ వేసి వేయించుకోవాలి.

4 / 5
తర్వాత అందులో ఎండు చేపలు వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత టమాటాలు వేయాలి. ఇప్పుడు మంచిగా నూనెలో ఇవి ఉడికేలా చూసుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతి పొడి వేసి మంచిగా ఉడకనివ్వాలి.

5 / 5
ఇవి బాగా ఉడికిన తర్వాత పచ్చి మామిడికాయ తొక్క తీసి వేసి, కప్పు ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు, కారం వేసి మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర, ఎండు కొబ్బరి పొడి వేసి, మరో ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి. అంతే మామిడికాయ, ఎండు చేపల కర్రీ రెడీ, ఇది నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటుంది.

Follow Us