Cholesterol Diet Tips : కొలెస్ట్రాల్ పెరగకుండా నియంత్రించడానికి ఇవిగో మార్గాలు..

|

Feb 22, 2022 | 6:06 PM

వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. మరీ ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడంతో శరీరాకృతి పూర్తిగా మారిపోతుంది. ఐతే మీ జీవనశైలిలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్యను సులువుగా అతిక్రమించవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

1 / 6
ఆహారం తీసుకున్న 30 నుంచి 45 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీరు త్రాగాలి. గోరు వెచ్చని నీరు ఆహారంలోని పోషకాలను సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఫలితంగా కలిగే అనుభూతిని మీరే చూస్తారు.

2 / 6
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమ మార్గం నిమ్మరసం తాగడం. ఈ డిటాక్స్ వాటర్ ఆయిల్ ఫుడ్స్ తిన్న తర్వాత పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడంలో కూడా ఎంతో ప్రయోజనకారి.

3 / 6
భోజనం తర్వాత కనీసం 20 నిమిషాలు నడిస్తే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణాశయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

4 / 6
హెవీ మీల్స్‌ తీసుకున్న 20 - 25 నిముషాల తర్వాత కొన్ని ప్రోబయోటిక్స్ తీసుకోవచ్చు. ప్రోబయోటిక్స్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది వివిధ వ్యాధుల నుంచి పేగులను కూడా రక్షిస్తుంది. ది బెస్ట్‌ ప్రోబయోటిక్ పెరుగు.

5 / 6
గంటకోసారి తక్కువ మొత్తంలో ఫైబర్ అధికంగా ఉండే పండ్లను తినడం కూడా మంచిదే. ఇవి మలబద్దకాన్ని నివారించి, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.

6 / 6
రోజు మొత్తంలో తీసుకునే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా చూసుకోండి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి, ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి పోషకాహార నిపుణులు ద్రవ ఆహారాన్ని తినమని ఎక్కువగా సిఫార్సు చేస్తారు.