మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలో తెలుసుకోండి..

|

May 02, 2024 | 12:17 PM

నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా ఫిట్‌నెస్‌ను కూడా కాపాడుతుంది. అందుకే ప్రతి వ్యక్తి రోజూ తప్పనిసరిగా ఉదయం లేదా, సాయంత్రం వాకింగ్‌ అలవాటు చేసుకోవాలని వైద్యులు పదే పదే చెబుతున్నారు. పైగా వాకింగ్‌ అనేది ఎలాంటి పరికరాలు అవసరం లేని వ్యాయామం. ఏ వయస్సు వ్యక్తి అయినా సరే వాకింగ్‌ చేయవచ్చు. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఒక రోజులో ఎన్ని అడుగులు వేయాలో మీకు తెలుసా? అటువంటి పరిస్థితిలో మీ వయస్సు ప్రకారం ఎంత వాకింగ్ చేయాలో వివరంగా తెలుసుకుందాం.

1 / 5
ప్రతి రోజూ వాకింగ్‌తో రోజంతా ఆ వ్యక్తి ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడానికి, డైటరీ రొటీన్‌లకు కట్టుబడి ఉండటంలో వాకింగ్‌ అనేకది కీలక ప్రోత్సహిస్తుంది. వాకింగ్‌ అలవాటుతో మీ రోజువారీ కార్యకలాపాలను ఎంతో ఏకాగ్రతతో చేయవచ్చు. వాస్తవానికి, ప్రతి వ్యక్తి ప్రతిరోజూ కనీసం అరగంట పాటు నడవాలి.

2 / 5
ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల వరకు వేగంగా నడవడం వల్ల అనేక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ఒక వ్యక్తి రోజుకు 10,000 అడుగులు నడవడానికి ప్రయత్నించాలి. ఇక, వయసు ఆధారంగా చూసుకుంటే.. 5 నుండి 7 సంవత్సరాల మధ్య పిల్లలు రోజుకు కనీసం 12000 నుండి 15000 అడుగులు నడవాలి.

3 / 5
ఇక, 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నవారు కూడా రోజూ 12000 అడుగులు నడవాలి. అయితే 40 ఏళ్లు దాటిన వారు ప్రతిరోజూ 11000 అడుగులు వేయాలి. వాకింగ్‌ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజూ వాకింగ్‌ చేసే అలవాటు ఉన్నవారికి గుండె జబ్బుల రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే నడకతో శరీరంలో రక్తప్రసరణ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటును అదుపులోకి వస్తుంది.

4 / 5
అదే సమయంలో 50 ఏళ్లు పైబడిన వారు రోజూ 10000 అడుగులు వేయాలి. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 8000 అడుగులు వేయాలి. ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం వాకింగ్‌ చేసే అలవాటు ఉన్నవారిలో జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది. పొట్ట శుభ్రంగా ఉంటుంది. మనసుకు ప్రశాంతత, మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది. అటువంటి పరిస్థితిలో, వయస్సు ప్రకారం నడక ఎంత చేయాలో మీకు తెలిసి ఉండాలి.

5 / 5
అయితే, వాకింగ్‌ అలవాటును మొదట నెమ్మదిగా నడకను మొదలుపెట్టి క్రమక్రమంగా వేగాన్ని పెంచాలి. గంటకు 6.4 కి.మీ వేగంతో రోజూ 30 నిమిషాల పాటు నడవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు.. అప్పుడప్పుడు రివర్స్‌ వాకింగ్‌ కూడా ప్రాక్టీ్‌స్‌ చేయండి.. ఇది కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.