
రక్తపోటు: విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పైనాపిల్ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కనుక ప్రతిరోజూ మధ్యాహ్నం పూట ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగండి.

జీర్ణవ్యవస్థ: కడుపు సంబంధిత సమస్యలతో తరచుగా ఇబ్బంది పడే వ్యక్తులకు మంచి ఫుడ్ పైనాపిల్ జ్యూస్. పైనాపిల్ జ్యూస్ తాగడం వలన జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. ఫైనాపిల్ లో ఉండే ఫైబర్.. పేగులు ఆరోగ్యంగా ఉండడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది: పైనాపిల్ జ్యూస్‌లోని మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ముఖ్యమైన విటమిన్ పైనాపిల్‌లో అధికంగా ఉంటుంది.

బరువును అదుపులో ఉంచుతుంది: వేసవి కాలం బరువు తగ్గడానికి ఉత్తమ సీజన్. యోగా, వ్యాయామం వంటి వాటితో పాటు... ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో అల్పాహారం తీసుకున్న రెండు గంటల తర్వాత పైనాపిల్ రసం తాగడం ద్వారా బరువు తగ్గవచ్చు.

ఎముకల పటిష్టత: పైనాపిల్ జ్యూస్ ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. నిజానికి, పైనాపిల్‌లో మాంగనీస్, కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వలన ఎముకలే కాకుండా దంతాలు కూడా దృఢంగా మారుతాయి.