వామ్మో.. వక్కలు తింటే ఇన్ని లాభాలా..? అదిరిపోయే ప్రయోజనాలు తెలిస్తే..

Updated on: Apr 29, 2025 | 12:11 PM

వక్కలు.. దాదాపు అందరికీ తెలిసిందే.. తమలపాకుల్లో వక్క, సున్నం కలిపి తింటే జీర్ణక్రియకు మంచి జరుగుతుందని చెబుతుంటారు. తమలపాకు, సున్నం మాట పక్కపెడితే.. ఇందులో కలిపే వక్కలతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని చెబుతున్నారు. అనేక తీవ్రమైన వ్యాధులను నయం చేయడంలోనూ, మందులు కూడా పనికిరాని వ్యాధులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అసలు వక్కలు తినటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
వక్కల్లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ బారిన పడకుండా నిరోధిస్తాయి. వీటిల్లో నొప్పి తగ్గించే లక్షణం కూడా ఉంటుంది. వీటికున్న యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాల  కారణంగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వక్కలు తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది.

2 / 5
వక్కలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వక్కలు జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. వక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది.

3 / 5
వక్క నోటి దుర్వాసనను తొలగించడానికి, పళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. వక్కను దంచి దంతాలకు మర్దన చేయడం వల్ల దంత వ్యాధులు నయమై నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వక్కలు అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి మేలు చేస్తాయి.

4 / 5
కొన్ని పరిశోధనలు వక్కను పరిమిత మోతాదులో తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నాయి. వక్కలు కడుపులోని క్రిములను చంపుతాయి. అయితే వక్కలు మరీ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
తరచూ వక్కలు, ఆకులు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని , క్యాన్సర్లు రావడానికి అవకాశం ఉందని నిపుణులు చెబుతారు. అదేపనిగా నమలడం వల్ల మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వక్కలు, వక్కపొడిని గర్భిణులు తీసుకోకూడదు.