Rice: బియ్యం పురుగు పడుతోందా? ఇలా చేశారంటే ఏడాదంతా నిల్వ చేయొచ్చు..

|

Apr 18, 2023 | 8:42 AM

ఏడాది పొడవునా బియ్యం నిల్వ ఉంచుకోవడానికి గృహిణులు ఇబ్బంది పడిపోతుంటారు. చిన్న చిన్న పురుగులు చేరి బియ్యం పాడు చేస్తాయి. బియ్యం నుంచి పురుగులను వేరు చేయడానికి నానా అగచాట్లు పడవల్సి వస్తుంది. ఈ చిట్కాలు పాటించారంటే బియ్యం పురుగుపట్టకుండా సంవత్సరం పొడవునా నిల్వ చేయోచ్చు. అవేంటో తెలుసుకుందాం..

1 / 5

2 / 5
బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే కర్పూరం బిళ్లలను మెత్తగా పొడిగా చేసుకుని చిన్న చిన్న కాటన్‌ క్లాత్‌లలో ఉంచి, బియ్యం సంచిలో వేయాలి. ఇలా చేస్తే పురుగు పట్టకుండా నిరోధించవచ్చు.

3 / 5
ఎండిన వేపాకులు తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఇలా పొడిగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పొడి వస్త్రంలో కట్టుకుని, బియ్యం సంచిలో ఉంచడం వల్ల పురుగు పట్టకుండా ఆపవచ్చు.

4 / 5
బియ్యంలో పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా పురుగులు పట్టకుండా ఉండాలంటే వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా  బియ్యం డబ్బాలో వేస్తే పురుగులన్నీ ఇట్టే పారిపోతాయి.

5 / 5
బియ్యం పురుగు పట్టకుండా ఆపడంలో లవంగాలు మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. కొన్ని లవంగాలను తీసుకుని, పొడిగా చేసుకుని ఆ పొడిని పలుచటి పొడి వస్త్రంలో కట్టి బియ్యంలో ఉంచాలి.  అలాగే పొడి చేయకుండా లవంగాలను  వస్త్రంలో కట్టి, బియ్యంలో ఉంచినా సరే పురుగు పట్టకుండా నివారించవచ్చు.