
నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఒకేసారి వారానికి సరిపడ కూరగాయలను మార్కెల్ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. వీటిని శుభ్రం చేసి, ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే సాధారణంగా అన్ని రకాల కూరగాయలను ఫ్రిజ్‌లో సర్దేయడం మనలో చాలా మందికి అలవాటు. కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడం చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

దాదాపు అందరూ దోసకాయలను ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే దోసకాయలను ఫ్రిజ్‌లో ఉంచక పోవడమే మంచిది. 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద దోసకాయలు ఉంటే త్వరగా చెడిపోవడం ప్రారంభిస్తాయి. అందుకే దోసకాయలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు.

టమాటాలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల వాటి రుచి తగ్గుతుంది. టమాటాలను ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. టమాటాలను వంటగదిలో ఒక బుట్టలో వేసి నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి.

బంగాళాదుంపలు దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో కనిపిస్తాయి. అయితే బంగాళాదుంపలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచవద్దు. దీనివల్ల అవి చెడిపోయి మొలకెత్తుతాయి.

అలాగే ఉల్లిపాయలను కూడా రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకూడదు. ఉల్లిపాయలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే త్వరగా పాడవుతాయి. ఉల్లిపాయలను చల్లని, బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలి. ఉల్లిపాయలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల అవి త్వరగా చెడిపోతాయి.