
కర్ణాటక నార్త్ జిల్లాలోని కార్వార్ బీచ్‌లో అరుదైన సముద్ర జీవి కనిపించింది. గూస్ బార్నాకిల్ అని పిలువబడే ఈ అరుదైన సముద్ర జీవిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గూస్ బార్నాకిల్ షెల్ మాదిరిగా కనిపించినప్పటికీ, ఇది షెల్ జాతి కాదు.

మునుపెన్నడూ చూడని ఈ జీవిని చూడగానే జనాలు తమ మొబైల్ కెమెరాల్లో ఫొటోలు, వీడియోలు తీశారు.

పొలుసులుగా కనిపించే ఈ గూస్ బార్నాకిల్ సముద్రంలో సీసాలకు, పడవల దిగువకు అతుక్కుపోయి ఉంటుంది.

ఈ జీవి సాధారణంగా 2 సెం.మీ నుండి 8 సెం.మీ. వరకు పెరుగుతుంది. ఈ జీవి మంచి పోషకమైన ఆహారం. అందుకే కొన్ని దేశాలలో వీటిని ఎగబడి తింటుంటారు.

స్పానిష్, పోర్చుగీస్ ప్రజలు దీనిని పోషకమైన ఆహారంగా తింటారు.