
కార్తీక పౌర్ణమి వ్రతం చేసుకునే వాళ్లు చేయాల్సిన ప్రసాదం.. ఈ రోజున శివుడికి ఈ ప్రత్యేక నైవేద్యం పాకం గారెలు పెట్టాలి. మీరు వీటిని చేయాలనుకున్నప్పుడు మినప్పప్పును కనీసం 5 గంటల ముందు వీటిని నానబెట్టి ఆ తరవాత పిండిలా రుబ్బి, వేడి ఆయిల్ లో గారెల్లా వేయించి, ఆ తరవాత బెల్లం పాకంలో 10 నిమిషాలు నానబెట్టాలి. మరి, లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

పాకం గారెలకు కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు మినప్పప్పు లేదా మినపగుళ్లు, అర కప్పు బెల్లం , నీళ్లు (పాకం కోసం) ఒక గ్లాస్ , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి లేదా మిరియాల పొడి ఉంటే అది అయినా తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు, గారెలను కాల్చడనికి సరిపడా నూనెను తీసుకోవాలి.

పాకం గారెలు తయారీ విధానం : ముందుగా మినప్పప్పునుతీసుకుని బాగా కడిగి 5 గంటల పాటు ఒక పొడవాటి గిన్నెలో నానబెట్టాలి. ఆ తరవాత నీళ్లు మొత్తం వంపేసి, ఇంకా తక్కువ నీళ్లతో గట్టిగా, మెత్తగా పిండి పట్టుకోవాలి ఆ తరవాత దీనిలో సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇలా చేస్తే గారెలు మంచిగా కాలుతాయి

పాకం గారెలు తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో తురిమి పెట్టుకున్న బెల్లం, నీళ్లు, అర టేబుల్ స్పూన్ యాలకుల లేదా మిరియాల పొడి వేసి సన్నని మంటపై బెల్లం మొత్తం పూర్తిగా కరిగే వరకు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు పాన్ పెట్టి దానిలో నూనె వేసి వేడి చేయాలి. ఆ తరవాత ఒక కవర్ తీసుకుని గారెకు చిన్న రంధ్రం పెట్టి వేయించాలి.

పాకం గారెలు తయారీ విధానం స్టెప్ 2 : ఇక ఇప్పుడు వేడి నూనె బాగా కాగిన తరవాత ఈ గారెను వేసి ఒక వైపు కాలిన తరవాత ఇంకో వైపు బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఈ వేయించిన వేడి గారెలను తీసుకుని బెల్లం పాకంలో వేసి 10 నిమిషాలు ఉంచాలి.ఆ తర్వాత తీసి వేరే గిన్నెలోకి మార్చి, పాకం పైన పోసి తినడమే.