
జొన్న పిండి పకోడీని మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా వీటిని మీరు పుదీనా చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే, వాన పడేటప్పుడు సాయంత్రం పూట తింటే ఇలాంటి టేస్ట్ మీకు ఎక్కడా దొరకదు.మీరు వీటిని అన్నంలో పెట్టుకుని కూడా తినొచ్చు. ఒకసారి మొదలు పెడితే ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తూనే ఉంటారు.

జొన్న పిండి పకోడికి కావాల్సిన పదార్ధాలు : ఒక టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండి, కప్పున్నర జొన్న పిండి , అర కప్పు శెనగపిండి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర కప్పు కరివేపాకు ఆకులు, కొత్తిమీర, రుచికి సరిపడా కారం, రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, సోడా ఉప్పు, అర కప్పు నూనెను తీసుకోవాలి.

ఈ పకోడి ఎలా చేయాలంటే? మీరు ముందుగా జొన్న పిండిని తీసుకుని ఒక గిన్నెలో దీనిని కలుపుకోవాలి. దీనిలో ఒక కప్పు శెనగ పిండిని కూడా దీనిలో కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో మొక్కజొన్న పిండిని కూడా వేసుకోవచ్చు. ఇంకా ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండినీ కలుపుకోవాలి.

ఈ పిండి మిశ్రమంలో కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర ఆకులు, ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో వేసి కలుపుకోవాలి. ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీనిలో అవసరమైతే నీళ్లు కూడా వేసి పకోడీని పిండిలాగా తయారు చేసుకోవాలి.

ఈ పకోడీలను బాగా వేయించాలి : ఇంకా దీనిలో సోడా ఉప్పు కొద్దిగా వేస్తే .. కర కర లాడుతూ తినడానికి రుచిగా ఉంటుంది ఇంకా అదిరిపోతోంది. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి పాన్ లో ఆయిల్ చేసి అది బాగా వేడయ్యాక, ఈ మిశ్రమాన్ని తీసుకుని ముద్దలుగా తీసుకుని నూనెలో కొద్దీ కొద్దిగా వేయాలి. బంగారు కలర్లోకి మారే వరకు బాగా కాల్చుకోవాలి.