
మహిళలకు చాలా వరకు మల్లెపువ్వులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తుంటారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరి ఇంటి వద్ద మల్లె మొక్క ఉంటుంది. అయితే మీ ఇంటి మొక్క పూయడం ఆపేసింది. అయినా కంగారు పడాల్సిన పనే లేదు. చిన్న చిట్కాలు పాటిస్తే మొక్క వేపుగా పెరుగుతూ గత్తులుగా పూలు పూస్తుందంట. దీని కోసం మీరు ముందుగా మొక్కకు సూర్య రశ్మి అందేలా చేయాలి. ఈ ప్లాంట్‌కు దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఎండ అవసరం. అందువలన సూర్య రశ్మి ఎక్కువగా అందితే మొక్క వేపుగా పెరుగుతూ చెట్టు నిండుగా పూలను పూస్తుంది.

అలాగే కుండీలో నాటే సమయంలో కూడా తప్పకుండా దాని సైజు చూసుకోవాలి. మల్లె మొక్కను చిన్న కుండీల్లో పెంచడం కంటే, 12 నుంచి 14 అంగుళాల పొడవు ఉన్న కుండీలో నాటడం వలన దాని వేర్లు బలంగా ఉంటాయి. అంతే కాకుండా కుండకు మధ్య మధ్యలో రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. దీని వలన నీరు నిలిచిపోకుండా ఉంటుంది. మొక్క వేపుగా పెరిగి ఎక్కువగా మొగ్గలు వేస్తుంది.

అలాగే మట్టి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సీజన్‌తో పని లేకుండా మీ ఇంటి మల్లె మొక్క విరగబూయాలి అంటే మొక్కకు 60 శాతం వరకు బంక మట్టి, 30 శాతం వర్మీ కంపోస్ట్, 10 శాతం పెర్లైట్ తో పూర్తిగా కలపాలి. అలాంటి మట్టిలో మల్లె మొక్కకు కలబంద జెల్ అప్లై చేసి నాటుకోవడం వలన వేపుగా బలంగా పెరుగుతుంది. పువ్వులు కూడా బుట్టల కొద్దీ పూస్తాయి.

అంతే కాకుండా నీరు కూడా చాలా వరకు అవసరం. కానీ ప్రతి రోజూ పోయాల్సిన అవసరం లేదు. వేర్ల దగ్గర తడి ఆరిన మరసటి రోజు నీళ్లు పోయాలి. ఇలా చేయడం వలన మొక్క వేపుగా పెరుగుతుంది. అంతే కాకుండా చెట్టు నిండుగా గుబురుగా పువ్వులు పూస్తుంది. అయితే మొక్కకు ఎక్కు నీరు ఉండటం, నీరు నిలిచిపోయి ఉండకుండా చూసుకోవాలి.

అలాగే మీ ఇంటి మల్లె చెట్టు వేపుగా పెరుగుతున్నా పువ్వులు పూయకపోతే, ఎరువులను వేయాలి. ఉల్లి పాయల తొక్కలు,బియ్యం కడిగిన నీరు, అరటి పండు తొక్కల నీరు వీటిని వేయడం వలన మొక్క కొత్తగా మొగ్గలు పెడుతుంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు మొక్క కొమ్మలను కట్ చేయడం వలన కూడా మొక్క వేపుగా పెరిగి ఎక్కువ మొత్తంలో పూలు పూస్తుంది.