Memory Boost Tricks: మీ మెమోరీ వీక్ అనుకుంటున్నారా..? మీ కోసమే ఈ 9 గేమ్ ఛేంజర్ ట్రిక్స్..!

Updated on: Jan 24, 2026 | 7:56 AM

Psychology tricks for memory: మారుతున్న జీవనశైలి, తీసుకునే ఆహారం కారణంగా మతిపరుపునకు ప్రధాన కారణంగా నిలుస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు శరీరానికి అందకపోవడం, సమయానికి తగినట్లు ఆహారం తీసుకోకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం లాంటి కారణాలు ఉంటున్నాయి. అయితే, జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 10
Memory Improvement Techniques: ఇటీవల కాలంలో వృద్ధులు, పెద్దలతోపాటు యువకులు, పిల్లల్లోనూ జ్ఞాపక శక్తి లోపిస్తోంది. దీంతో చిన్న చిన్న విషయాలు కూడా మరిచిపోతున్నారు. మారుతున్న జీవనశైలి, తీసుకునే ఆహారం కారణంగా మతిపరుపునకు ప్రధాన కారణంగా నిలుస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు శరీరానికి అందకపోవడం, సమయానికి తగినట్లు ఆహారం తీసుకోకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం లాంటి కారణాలు ఉంటున్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి షిఫ్టుల్లో విధులు నిర్వహించడం వల్ల రాత్రిపూట సరిగా నిద్రలేకుండా పోతోంది. మరికొందరు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో మెదడుపై తీవ్ర ఒత్తిడి పెరిగిపోతోంది. ఇవన్నీ కలిపి జ్ఞాపకశక్తి లోపించడానికి కారణమవుతున్నాయి. అయితే, జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Memory Improvement Techniques: ఇటీవల కాలంలో వృద్ధులు, పెద్దలతోపాటు యువకులు, పిల్లల్లోనూ జ్ఞాపక శక్తి లోపిస్తోంది. దీంతో చిన్న చిన్న విషయాలు కూడా మరిచిపోతున్నారు. మారుతున్న జీవనశైలి, తీసుకునే ఆహారం కారణంగా మతిపరుపునకు ప్రధాన కారణంగా నిలుస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు శరీరానికి అందకపోవడం, సమయానికి తగినట్లు ఆహారం తీసుకోకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం లాంటి కారణాలు ఉంటున్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి షిఫ్టుల్లో విధులు నిర్వహించడం వల్ల రాత్రిపూట సరిగా నిద్రలేకుండా పోతోంది. మరికొందరు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో మెదడుపై తీవ్ర ఒత్తిడి పెరిగిపోతోంది. ఇవన్నీ కలిపి జ్ఞాపకశక్తి లోపించడానికి కారణమవుతున్నాయి. అయితే, జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 10

స్టడీ బ్రేక్స్.. 

మనం ఏదైనా చదువుతున్నప్పుడు కనీసం 25 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవడం మంచిది. షార్ట్ బ్రేక్స్ తీసుకోవడం ద్వారా మీ ఏకాగ్రత పెరుగుతుంది. ఇది మెదడుకు సంబంధించిన ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో మీ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.

స్టడీ బ్రేక్స్.. మనం ఏదైనా చదువుతున్నప్పుడు కనీసం 25 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవడం మంచిది. షార్ట్ బ్రేక్స్ తీసుకోవడం ద్వారా మీ ఏకాగ్రత పెరుగుతుంది. ఇది మెదడుకు సంబంధించిన ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో మీ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.

3 / 10

చర్చించడం.. 

మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీకు మీరే లేదా ఎవరైతోనైనా చర్చించి పరిష్కరించుకోండి. వాటిని ఎక్కడైనా రాసుకుని.. వాటికి తగిన పరిష్కారాలను గుర్తించండి. ఇది మీ మెదడుపై ఒత్తిడి తగ్గించి మతి మరుపును తగ్గిస్తుంది.

చర్చించడం.. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీకు మీరే లేదా ఎవరైతోనైనా చర్చించి పరిష్కరించుకోండి. వాటిని ఎక్కడైనా రాసుకుని.. వాటికి తగిన పరిష్కారాలను గుర్తించండి. ఇది మీ మెదడుపై ఒత్తిడి తగ్గించి మతి మరుపును తగ్గిస్తుంది.

4 / 10

మైండ్ మ్యాపింగ్..

సమాచారాన్ని సేకరించినప్పుడు దాన్ని విజువలైజ్ చేయండి. మీరు తెలుసుకోవాలనుకుంటున్న సమస్యాత్మక విషయాన్ని దృశ్య రూపకంగా ఊహించుకున్నట్లయితే మీకు గుర్తుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మైండ్ మ్యాపింగ్.. సమాచారాన్ని సేకరించినప్పుడు దాన్ని విజువలైజ్ చేయండి. మీరు తెలుసుకోవాలనుకుంటున్న సమస్యాత్మక విషయాన్ని దృశ్య రూపకంగా ఊహించుకున్నట్లయితే మీకు గుర్తుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

5 / 10

సమగ్రంగా విశ్లేషించండి..

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం ద్వారా మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. మీకు కొంచెం తెలిసిన విషయంపై పరిశోధనలు చేయడం ద్వారా దాని గురించి పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇలా తరచూ సమగ్ర విశ్లేషణలు చేయడం ద్వారా మీ జ్ఞాపక శక్తి చాలా మెరుగవుతుంది.

సమగ్రంగా విశ్లేషించండి.. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం ద్వారా మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. మీకు కొంచెం తెలిసిన విషయంపై పరిశోధనలు చేయడం ద్వారా దాని గురించి పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇలా తరచూ సమగ్ర విశ్లేషణలు చేయడం ద్వారా మీ జ్ఞాపక శక్తి చాలా మెరుగవుతుంది.

6 / 10

విజువల్ మెమోరీ..

మీరు తెలుసుకోవాలనుకుంటున్న సమాచారాన్ని డయాగ్రామ్, లేదా చార్ట్స్ రూపంలో వేసి సరిపోల్చుకోవడం మీకు మరింత గుర్తుండేలా చేస్తుంది. ఇలా చేయడం ద్వారా మీకు విజువల్ మెమోరీ కూడా మెరుగవుతుంది. ఏకాగ్రత కూడా మరింత పెరుగుతుంది.

విజువల్ మెమోరీ.. మీరు తెలుసుకోవాలనుకుంటున్న సమాచారాన్ని డయాగ్రామ్, లేదా చార్ట్స్ రూపంలో వేసి సరిపోల్చుకోవడం మీకు మరింత గుర్తుండేలా చేస్తుంది. ఇలా చేయడం ద్వారా మీకు విజువల్ మెమోరీ కూడా మెరుగవుతుంది. ఏకాగ్రత కూడా మరింత పెరుగుతుంది.

7 / 10

రివిజన్..

మీరు ఇప్పటికే చదువుకున్న లేదా అభ్యసించిన అంశాలు మీకు గుర్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల మీ మెమోరీ పవర్ మరింత పెరుగుతుంది. మీరు పరీక్షల్లో కూడా మరింత మెరుగైన ఫలితాలను చూస్తారు.

రివిజన్.. మీరు ఇప్పటికే చదువుకున్న లేదా అభ్యసించిన అంశాలు మీకు గుర్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల మీ మెమోరీ పవర్ మరింత పెరుగుతుంది. మీరు పరీక్షల్లో కూడా మరింత మెరుగైన ఫలితాలను చూస్తారు.

8 / 10

ఒకే అంశంపై కాకుండా..

మీరు చదువుతున్నప్పుడు చాలా సమయంపాటు ఒకే సబ్జెక్టు కాకుండా వివిధ టాపిక్స్‌కు సమయం కేటాయించి చదవడం వల్ల మీ బ్రెయిన్ తొందరగా వాటిని గ్రహిస్తుంది. అంతేగాక, వాటిని సవాలుగా తీసుకుని  సమర్థవంతంగా గుర్తుంచుకుంటుంది. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను కూడా పెంచుతుంది.

ఒకే అంశంపై కాకుండా.. మీరు చదువుతున్నప్పుడు చాలా సమయంపాటు ఒకే సబ్జెక్టు కాకుండా వివిధ టాపిక్స్‌కు సమయం కేటాయించి చదవడం వల్ల మీ బ్రెయిన్ తొందరగా వాటిని గ్రహిస్తుంది. అంతేగాక, వాటిని సవాలుగా తీసుకుని సమర్థవంతంగా గుర్తుంచుకుంటుంది. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను కూడా పెంచుతుంది.

9 / 10

రిపిటేషన్ పాస్..

ఒకేసారి సుదీర్ఘమైన సమయం కేటాయించి చదవడం కన్నా.. చిన్న చిన్న గ్యాప్స్ ఇచ్చి రెగ్యూలర్‌గా చదవడం మీ మెమోరీ పవర్‌ను పెంచుతుంది. ఇలాగే మీరు మీ అభ్యసాన్ని కొనసాగిస్తే జ్ఞాపకశక్తి మెరుగుపర్చుకోవడంలో మంచి ఫలితాలను చూస్తారు.

రిపిటేషన్ పాస్.. ఒకేసారి సుదీర్ఘమైన సమయం కేటాయించి చదవడం కన్నా.. చిన్న చిన్న గ్యాప్స్ ఇచ్చి రెగ్యూలర్‌గా చదవడం మీ మెమోరీ పవర్‌ను పెంచుతుంది. ఇలాగే మీరు మీ అభ్యసాన్ని కొనసాగిస్తే జ్ఞాపకశక్తి మెరుగుపర్చుకోవడంలో మంచి ఫలితాలను చూస్తారు.

10 / 10
నాణ్యమైన నిద్ర, వ్యాయామం.. 
నాణ్యమైన నిద్రకు సమయం కేటాయించడంలో, వ్యాయామం చేయడంలోనూ మీరు ఎలాంటి కాంప్రమైస్ కావొద్దు. ఈ రెండు మెమోరీ పవర్‌ను పెంచడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. సరైన సమయంలో తగినంత నిద్ర, ఉదయం, సాయంత్రం చేసే వ్యాయామాలు మెదడుకు విశ్రాంతిని కలించి మీ జ్ఞాపకశక్తిని ఊహించని విధంగా మెరుగుపరుస్తాయి.

నాణ్యమైన నిద్ర, వ్యాయామం.. నాణ్యమైన నిద్రకు సమయం కేటాయించడంలో, వ్యాయామం చేయడంలోనూ మీరు ఎలాంటి కాంప్రమైస్ కావొద్దు. ఈ రెండు మెమోరీ పవర్‌ను పెంచడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. సరైన సమయంలో తగినంత నిద్ర, ఉదయం, సాయంత్రం చేసే వ్యాయామాలు మెదడుకు విశ్రాంతిని కలించి మీ జ్ఞాపకశక్తిని ఊహించని విధంగా మెరుగుపరుస్తాయి.