కలలో కాకి ఇలా కనిపించడం మరణ సూచికమేనా?

Updated on: Mar 13, 2026 | 9:10 AM

కలలు రావడం సహజం. ఒకొక్కరికీ ఒక్కో విధమైన కలలు వస్తుంటాయి. కొంతమందికి కలలో పక్షులు కూడా కనిపిస్తాయి. అయితే కొన్ని సార్లు కాకులు కూడా కలలో కినిపిస్తుంటాయి. అయితే పెద్దవారు చెబుతుంటారు కలలో కాకి కనిపించడం మంచిదికాదు, ఇది కనిపించిన విధానం బట్టి దాని ఫలితాలు ఉంటాయి. కొన్ని సార్లు ఇది మరణ సంకేతాలను కూడా తెలియజేస్తుందని చెబుతుంటారు. కాగా, ఇది కలలో ఎలా కనిపించడం అశుభకరమో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఇక స్వప్న శాస్త్రం ప్రకారం, ఇందులో కొన్ని శుభఫలితాలను ఇచ్చే కలలు ఉంటే, మరికొన్ని అశుభ ఫలితాలను ఇస్తుంటాయి. ఇక కాకిని  శని దేవుడి వాహనం అంటారు. ఇది ఇంటి ముందుకు రావడం, అరవడం వలన కొన్ని శుభ, అశుభ ఫలితాలు ఉంటాయి. అలాగే కలలోకి రావడం కూడా కొన్ని జరిగే సంఘటనలను ఇది సూచిస్తుందంట. మరి స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో కాకి ఎలా కనిపించడం మంచిది కాదో తెలుసుకుందాం.

2 / 5
కలలో కాకి, భయంకరమైన శబ్ధాలు చేస్తూ కనిపించడం అస్సలే మంచిదికాదంట, ఇది మరణ సంకేతం అని చెబుతున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు. అంతేకాకుండా కలలో కాకి మీ తలపై కూర్చున్నట్లుగా కనిపించడం కూడా మరణానికి సంకేతంమే. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగే సూచన. అందువలన ఇలాంటి కలలు చాలా అశుభకరమైనవి అని చెబుతున్నారు నిపుణులు.

3 / 5
అదే విధంగా, చనిపోయినట్లు కాకి కలలో కనిపిస్తే ఇది మీ జీవితంలోని సమస్యలను లేదా దు:ఖం,  మరణవార్తలకు సంకేతం అని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా కలలో కాకి గూడు కట్టుకున్నట్లుగా కనిపిస్తే ఇది చాలా అశుభకరం.  ఇది మీ కుటుంబలో గొడవలు లేదా అశాంతికి సంకేతం.

4 / 5
ఇక కొంత మందికి కాకి తన్నినట్లు కల వస్తుంది. ఇది కూడా చాలా అశుభకరమైన కల. ఇది కుటుంబంలోని వారి మరణవార్తకు సంకేతం. అలాగే కలలో గుంపులు గుంపులుగా కాకులు కనిపించడం, అనేది త్వరలో ఏదో చెడు జరుగుతుంది అనేదానికి సంకేతం అంటున్నారు నిపుణులు. కానీ కలలో కాకి వెన్నె లేదా పెరుగు తింటున్నట్లు కనిపించడం చాలా మంచిదంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us