
అకస్మాత్తుగా బట్టతల రావడం అనేది కేవలం కాస్మెటిక్ సమస్య మాత్రమే కాదు. ఇది గుండెపోటుకు సంకేతం కూడా కావచ్చు. అందుకే జుట్టు రాలడానికి, గుండెపోటుకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మందికి ఆకస్మిక బట్టతల సమస్యతో బాధపడుతుంటారు. దానిని కేవలం సౌందర్య సమస్యగా విస్మరిస్తారు. కానీ ఆకస్మిక బట్టతల గుండె ఆరోగ్యానికి సంబంధించినదని మీకు తెలుసా? జుట్టు రాలడం, గుండెపోటు మధ్య సంబంధం చాలా లోతైనదని వైద్యులు అంటున్నారు.

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. వేగంగా జుట్టు రాలడం అనేది హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాల వల్ల మాత్రమే కాదు.. ఇతర ప్రాణాంతక సమస్యలకు కూడా ఓ సంకేతం. బట్టతల, గుండెపోటు ప్రమాదం మధ్య సంబంధం ఉందని తాజా పరిశోధనలో తేలింది.

జుట్టు నిర్మాణానికి ముఖ్యమైన పోషకం కొల్లాజెన్. దీని ఉత్పత్తికి విటమిన్ సి చాలా అవసరం. దీని లోపం వల్ల జుట్టు బలహీనంగా మారి విరిగిపోతుంది. దీనిని నివారించడానికి ఆమ్లా (ఇండియన్ గూస్బెర్రీ), నారింజ వంటి ఆహారాలు తినాలి.

సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యపానం గుండెను బలహీనపరచడమే కాకుండా అకాల బట్టతలకి కూడా దారితీయవచ్చు. ఈ సమస్యను విస్మరించకూడదు. ముఖ్యంగా 30 సంవత్సరాల తర్వాత ఇది వేగంగా పెరుగుతుంది.

చలి, ఒత్తిడి వల్ల కూడా వేళ్ల చర్మం రంగు మారవచ్చు. అయితే ఈ లక్షణం మళ్లీ మళ్లీ కనిపిస్తే, గుండె ధమనుల వ్యాధికి సంకేతం కావచ్చు. కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.