PM Maandhan Yojana: ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో చేరండి.. నెలకు రూ. 3000 పెన్షన్ పొందండి..

|

Jan 13, 2023 | 1:51 PM

దేశంలోని అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన (పీఎం మంధన్ యోజన)ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

1 / 6
దేశంలోని అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ఈ పింఛన్ ఉపకరిస్తుంది.

2 / 6
ఈ పథకం కింద నెలకు కనీసం 3 వేల రూపాయలు ఇస్తారు. పెన్షన్ సమయంలో వ్యక్తి మరణిస్తే లబ్ధిదారుని భార్య లేదా భర్త పెన్షన్‌లో 50 శాతం పొందుతారు.

3 / 6
నెలకు 15 వేల రూపాయల వరకు సంపాదించే వారికి ఈ పథకం ప్రయోజనం అందుతుంది. అలాగే, పథకంలో చేరే వ్యక్తి వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

4 / 6
ఈ పథకం కింద, మీరు పెన్షన్ ప్లాన్‌లో ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తే, ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని జమ చేస్తుంది. ఇందులో రూ. 55 నుంచి 200 రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి.. మీరు పేరు రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి.

5 / 6
ఈ పథకంలో చేరాలంటే.. తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. అప్పుడే సదరు వ్యక్తి ఈ పథకం ప్రయోజనాన్ని పొందగలరు. ఇందుకోసం దీని కోసం మీరు సమీప CACని సంప్రదించాలి. పథకంలో రిజిస్ట్రేషన్ కోసం.. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బయోమెట్రిక్స్ డేటా రికార్డ్ చేయడం జరుగుతుంది.

6 / 6
రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత ఒక కార్డు ఇస్తారు. అదే శ్రమ యోగి పెన్షన్ కార్డ్. ఇందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. భవిష్యత్తులో ఈ నంబర్ ద్వారా మాత్రమే మీ ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే వీలు ఉంటుంది.