
RRR సినిమాలో అల్లూరి పాత్రలో అందరి ప్రశంసలు అందుకున్నాడు రామ్‌చరణ్. ఇందుకు గాను ఎన్టీఆర్‌తో సమానంగా రూ. 45 కోట్లు పారితోషికం తీసుకున్నాడట.

ఈ సినిమాలో 'జెన్నిఫర్' అనే పాత్రలో నటించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరిస్. తన పాత్ర కోసం కోటి రూపాయలు తీసుకుందట.

ఇక RRR చిత్రంలో కొమురం భీంగా నటించి మెప్పించాడు జూనియర్ ఎన్టీఆర్. ఇందుకు గాను రూ. 45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ నయా సూపర్ స్టార్ అలియా భట్ ఈ సినిమాలో కేవలం 20 నిమిషాలు మాత్రమే నటించింది. ఇందుకు గాను రూ.9 కోట్లు పారితోషికం తీసుకుందట.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ అతిథి పాత్రలో కనిపించాడు. ఇందుకుగాను అతను రూ. 25 కోట్ల పారితోషకం తీసుకున్నాడని సమచారం.