ఐదు నదుల అద్భుత సంగమం.. ప్రపంచంలోనే అరుదైన పంచనద క్షేత్రం విశేషాలు మీకు తెలుసా?

Updated on: May 14, 2026 | 1:31 PM

నదుల సంగమం అనేది ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనది. సాధారణంగా అలహాబాద్‌లోని గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం గురించి మనందరికీ తెలుసు. అయితే, ఐదు నదులు ఒకే చోట కలిసే అద్భుత దృశ్యం గురించి మీకు తెలుసా? ఈ ప్రాంతాన్ని స్థానికులు మహా సంగమం అని పిలుస్తారు. ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. పురాణాల ప్రకారం మహాభారత కాలంలో పాండవులు ఇక్కడ కొంతకాలం గడిపారని ప్రతీతి. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, పవిత్రమైన పంచనద సంగమం (Panchrada Sangam) విశేషాల గురించి ఇప్పుడు చూద్దాం..

1 / 5
ప్రపంచంలో ఎక్కడైనా రెండు లేదా మూడు నదుల కలయికను (సంగమం) చూస్తాం. కానీ, ఐదు నదులు ఒకే చోట కలిసే అద్భుత క్షేత్రం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఉన్న పంచనద (Pachnada) అటువంటి అరుదైన భౌగోళిక, ఆధ్యాత్మిక అద్భుతానికి వేదిక. జలౌన్, ఇటావా జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో ఐదు ప్రధాన నదులు సంగమిస్తాయి.

2 / 5
ఇటావా జిల్లాలోని పంచనద వద్ద యమునా, చంబల్, క్వారీ, సింధ్, పహుజ్ అనే ఐదు పవిత్ర నదులు ఒకదానితో ఒకటి కలిసి సంగమిస్తాయి. ఈ ప్రాంతాన్ని స్థానికులు మహా సంగమం అని పిలుస్తారు. ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.  పురాణాల ప్రకారం మహాభారత కాలంలో పాండవులు ఇక్కడ కొంతకాలం గడిపారని ప్రతీతి.

3 / 5
ప్రపంచంలో మరెక్కడా ఇన్ని నదులు ఒకే చోట కలవడం చూడలేము. అందుకే దీనిని పంచనద సంగమం లేదా మహా సంగమం అని పిలుస్తారు. ఇక్కడ నదుల నీరు వేర్వేరు రంగుల్లో కనిపిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.  ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు వేలాది మంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.

4 / 5
ఈ ప్రాంతానికి పురాణాలతో కూడా విడదీయలేని సంబంధం ఉంది. మహాభారత కాలంలో పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించారని, భీముడు ఇక్కడే బకాసురుడిని సంహరించాడని స్థానికులు నమ్ముతారు. అంతేకాకుండా, తులసీదాసు ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై కొంతకాలం ఇక్కడ గడిపారని చెబుతారు. ఇక్కడి బాబా ముకుంద్ వనం ఆశ్రమం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.

5 / 5
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రతి ఏటా భారీ ఎత్తున మేళా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఈ ఐదు నదుల పవిత్ర నీటిలో స్నానాలు ఆచరిస్తారు. పక్షుల వీక్షణకు (Bird Watching) కూడా ఇది అనువైన ప్రాంతం. చంబల్ నదిలో ఉండే అరుదైన మొసళ్ళు, డాల్ఫిన్లను ఇక్కడ చూడవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన పంచనద క్షేత్రం ప్రతి ఒక్కరూ సందర్శించదగ్గ అద్భుత ప్రదేశం.

Follow Us