
రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. సుదూర ప్రయాణాలను మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త వందే భారత్ స్లీపర్ ట్రైన్స్‌ను తీసుకొస్తోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న చైర్ కార్, 16 కోచ్‌ల స్లీపర్ వేరియంట్‌లను మరింత అప్‌డేట్ దాన్ని 24 కోచ్‌ల పెంచేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. 2027 జూన్ నాటికి 24 కోచ్‌ల ఈ కొత్త వందేభారత్ స్లీపర్ కోచ్‌లను ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంగ పెట్టుకుంది.

24 కోచ్‌ల వందేభారత్ ఎక్కడ తయారవుతుంది?: ఈ సరికొత్త వందే భారత్ ట్రైన్ తయారీ బాధ్యతలను ఇండియన్ రైల్వే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)కి అప్పగించింది. ఇక్కడే కొత్తగా తీసుకురాబోతున్న 24 కోచ్‌లతో వందేభారత్ ట్రైన్స్ తయారు అవుతున్నాయి. మొత్తం 50 వందే భారత్ స్లీపర్ రైళ్లను వీళ్లు తయారు చేయనున్నారు. ఎక్కువ దూరం ప్రయాణాల్లో ఉన్న భారీ డిమాండ్‌ను తగ్గట్టు ఈ ట్రైన్‌ను అత్యాధునిక ఫీచర్లతో రూపొందిస్తున్నారు. ఇది రాజధాని, దురంతో వంటి ప్రీమియం రైళ్ల స్థాయిని మించి ప్రయాణ అనుభవాన్ని అందించడం.

24 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలు ఇవే: కొత్తగా తీసుకొస్తున్న 24 కోచ్‌ల వందేభారత్‌లో ఫస్ట్ ఏసీ (1st AC), సెకండ్ ఏసీ (2nd AC), థర్డ్ ఏసీ (3rd AC) కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికులకు కంఫర్ట్, ప్రీమియం అనుభూతిని ఇచ్చేలా నాణ్యమైన కుషనింగ్, ఎర్గోనామిక్ డిజైన్‌తో కూడిన బెర్తులను ఈ ట్రైన్‌లో ఏర్పాటు చేశారు.అంతేకాదు ఈ ట్రైన్‌లో మెట్రో తరహా ఆటోమేటిక్ డోర్లు, కోచ్‌ల మధ్య సులువుగా నడిచేందుకు అనువైన వెస్టిబ్యూల్ కనెక్టర్లను ఏర్పాటు చేయబోతున్నారు.

అలాగే విమాన తరహాలో వాక్యూమ్ టాయిలెట్లు, మెరుగైన పరిశుభ్రతా ప్రమాణాలు, టచ్-ఫ్రీ ఫిట్టింగ్‌లు ఉంటాయి. పొరపాటు ట్రైన్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే నివారించేందుకు స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ 'కవచ్ ఇందులో ఫిక్స్ చేశారు. దీని ఉండే మరో స్పెషాలిటీ ఏమిటంటే.. బయటి శబ్దం లోపలికి రాకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా ప్రత్యేకమైన సౌండ్ ఇన్సులేషన్ సిస్టమ్‌ను ఇందులో తీసుకురానున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బెర్తు వద్ద మొబైల్/ల్యాప్‌టాప్ చార్జింగ్ పాయింట్లు, రీడింగ్ లైట్లు, అలాగే ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే స్క్రీన్‌లు ఉంటాయి. మొత్తంగా మీరు ట్రైన్‌లో ఉన్నామా లేదా ఫైస్టార్ హోటల్‌లో ఉన్నామా అనే పీల్ వచ్చేలా ఈ ట్రైన్‌ను రూపొందించనున్నారు.

రైల్వే వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా వందే భారత్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది భారతీయ రైల్వే. ప్రస్తుతం ఉన్న16 కోచ్‌ల వేరియంట్‌తో పోలిస్తే, కొత్తగా రాబోయే 24 కోచ్‌ల ట్రైన్‌లో ఎక్కవ మంది ప్రయాణించవచ్చు. దీని వల్ల రద్దీతో పాటు ప్రయాణికులకు వెయిటింగ్ టైం తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది.