IND vs ENG: మరికొన్ని గంటల్లో భారత్ vs ఇంగ్లాండ్ హై వోల్టేజ్‌ మ్యాచ్‌.. సెమీస్‌ రేసులో నిలవాలంటే గెలవాల్సిందే

|

Feb 18, 2023 | 1:00 PM

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ ఉత్కంఠ దశకు చేరుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఉన్న భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ మరో ముఖ్యమైన మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈరోజు గ్కెబెర్హానాలోని సెయింట్ జార్జ్ పార్క్‌లో భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

1 / 6

2 / 6
ఇరు జట్లు ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. టీమిండియా  పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో, వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందగా, ఇంగ్లండ్ వెస్టిండీస్‌పై  7 వికెట్ల తేడాతో, ఐర్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

3 / 6
 ప్రస్తుతం రన్ రేట్ ఆధారంగా ఇంగ్లండ్ 4 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. భారత్ రెండో స్థానంలో ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లోనూ భారత మహిళల జట్టు గెలిస్తే 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

4 / 6
భారత్‌లో షఫాలీ వర్మ, స్మృతి మందన, జామియా, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. అయితే మందన, కౌర్ లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఈరోజు కీలక మ్యాచ్‌ కావడంతో వీరిద్దరూ మెరుపులు మెరిపించాల్సి ఉంది.

5 / 6
ఇంగ్లండ్ ఇక్కడ బలంగా ఉంది. బ్యాటర్లు చేతులెత్తేస్తే, బౌలర్లు మ్యాచ్ గెలిపిస్తున్నారు అలిన్ కాప్సే, కెప్టెన్ హేలీ మాథ్యూస్, క్యాంప్‌బెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి భారత బౌలర్లు కూడా వీటిని కట్టడి చేయడంపై దృష్టి సారించాలి.

6 / 6
భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. 
భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్జ్, హర్లీన్ డియోల్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరీ వస్త్రాకర్ , శిఖా పాండే, రేణుకా ఠాకూర్, అంజలి శర్వాణి

భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్జ్, హర్లీన్ డియోల్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరీ వస్త్రాకర్ , శిఖా పాండే, రేణుకా ఠాకూర్, అంజలి శర్వాణి